అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశమంతటా సాధారణ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే క్రైస్తవులపై, విశ్వాసులపై అన్యాయంగా అరెస్టులుకు, ఇబ్బందులకు కారణమైన మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దుచేయాలని యూకే కు చెందిన క్రైస్తవ సంస్థ—రిలీజ్ ఇంటర్నేషనల్ సి.యి.ఓ. పాల్ రాబిన్సన్ డిమాండ్ చేశారు.

2014లో నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్రైస్తవుల పట్ల అసహనం ఆశ్చర్యకర రీతిలో పెరిగిపోయిందని, భారత దేశంలోని మా ప్రతినిధులు అనేకమంది పాస్టర్లతో విశ్వాసులతో మాట్లాడినపుడు మతమార్పిడి నిరోధక చట్టాలు, హిందూ అతివాద సంస్థల ప్రతినిధులు వలన ఎంత ఇబ్బంది పడ్డారో తెలియజేశారని ఆయన అన్నారు.

మతపరంగా మైనారిటీలపై హింసకు, దౌర్జన్యానికి మూలకారణాలైన మతమార్పిడి నిరోధక చట్టాలను రద్దుచేసి, అపుడు ఎన్నికలకు వెళ్లాలని భారత ప్రభుత్వానికి ఆయన సూచించారు.