
నేటి విశ్వాస నాయకుడు
జేమ్స్ కేల్వెర్ట్
పరలోక పిలుపు : 08 మార్చి 1892
భయంలేని మిషనరీ, సువార్తికుడు, అనువాదకుడు, వెస్లియన్ చాపెల్ వ్యవస్థాపకుడు.
జేమ్స్ కేల్వెర్ట్ (1813–1892) ఫిజీ దీవుల్లో దైర్యంగా క్రైస్తవ్యమును వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ మిషనరీ. ఆ కాలములో, ఫిజీ హింసాత్మక గిరిజన యుద్ధానికి, నరమాంస భక్షకానికి ప్రసిద్ధి చెందింది. ప్రజలకు సువార్తను పరిచయం చేయడానికి కేల్వెర్ట్ అంకితభావంతో, చాలా ధైర్యంగా సేవచేశాడు. శత్రుత్వం, అనారోగ్యం, తన ప్రాణాలకు బెదిరింపులను ఎదుర్కొన్నప్పటికీ, ఈయన ప్రభువు పిలుపులో స్థిరంగా ఉన్నాడు. 1854లో నరమాంస భక్షణను త్యజించి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి శక్తివంతమైన ఫిజియన్ చీఫ్ రతు సెరు ఎపెనిసా కాకోబౌను ప్రభావితం చేయడం ఈయన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి. 1872లో ఫిజీని విడిచిపెట్టిన తర్వాత, ఈయన తన చివరి సంవత్సరాల వరకు ఆఫ్రికాలో తన మిషనరీ పనిని కొనసాగించాడు.
కేల్వెర్ట్, 1813 జనవరి 3న ఇంగ్లాండ్లోని యార్క్ షైర్ లోని పికరింగ్లో భక్తిగల క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుండి మెథడిస్ట్ బోధనలచే ప్రభావితమయ్యాడు. చిన్న వయస్సులోనే, విశ్వాసం, మిషనరీ పని పట్ల బలమైన అభిరుచిని ప్రదర్శించాడు. ఈయన లండన్ హాక్స్టన్ లోని వెస్లియన్ థియోలాజికల్ ఇన్స్టిట్యూషన్లో శిక్షణ పొందాడు, అక్కడ బైబిల్, వేదాంతశాస్త్రం, మిషనరీ శిక్షణను అభ్యసించాడు. 1838లో, 25 సంవత్సరాల వయస్సులో, ఈయన ఫిజీకి మెథడిస్ట్ మిషనరీగా పంపబడి, అక్కడ పదిహేడేళ్లు క్రైస్తవ మత వ్యాప్తిలో ప్రధాన పాత్ర పోషించాడు.
కేల్వెర్ట్, జాన్ హంట్తో పాటు 1838లో ఫిజీకి పంపబదగా, ఫిజియన్ చీఫ్లు మిషనరీలను తమ అధికారానికి ముప్పుగా భావించారు. ప్రత్యేకించి క్రైస్తవ్యము నరమాంస భక్షకం, యుద్ధం, బహుభార్యాత్వం వంటి పద్ధతులను వ్యతిరేకించింది. వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఈయన 18 సంవత్సరాలు (1838-1856) ఫిజీలో ఉన్నాడు. క్రైస్తవ మతం దీవుల అంతటా వ్యాపించడంతో ఒక అద్భుతమైన పరివర్తనను చూశాడు. ఫిజియన్ రాజు క్రైస్తవ మతంలోకి మారడంతో, నరమాంస భక్ష్యం, బహుభార్యాత్వం త్యజించబడ్డాయి, చాలా మంది ఫిజియన్లు ప్రభువును తెలుసుకునేందుకు, క్రీస్తు విశ్వాసాన్ని స్వీకరించడానికి దారితీసింది. రాజు యొక్క చివరి చర్య 1874లో ఫిజీని యునైటెడ్ కింగ్డమ్కు అప్పగించడం. 1856లో ఇంగ్లండ్కు తిరిగి వచ్చిన తర్వాత, ఈయన ఫిజియన్ భాషలో బైబిల్ ముద్రణను పర్యవేక్షించాడు, సువార్తను విస్తృతంగా చదవడానికి ఇంకా అర్థం చేసుకునేలా చూసుకున్నాడు. 1872లో, వెస్లియన్ మిషనరీ సొసైటీ ఈయనను దక్షిణాఫ్రికాకు పంపింది, అక్కడ కూడా తన సువార్త పనిని బహుగా కొనసాగించాడు.
కేల్వెర్ట్ 79 సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండ్లోని హేస్టింగ్స్లో మరణించాడు. అదే సంవత్సరం, ఈయన హేస్టింగ్స్లో వెస్లియన్ ప్రార్థనా మందిరాన్ని స్థాపించాడు, ఆ తర్వాత ఈయన గౌరవార్థం కేల్వెర్ట్ మెమోరియల్ చాపెల్గా పేరు మార్చబడింది.
