
నేటి విశ్వాస నాయకుడు
డేమ్ క్రిస్టియన్ హోవార్డ్
పరలోక పిలుపు : 22 ఏప్రిల్ 1999
వేదాంతవేత్త, పండితురాలు, చర్చి నాయకురాలు, మహిళా ఆర్డినేషన్ కోసం న్యాయవాది.
డేమ్ క్రిస్టియన్ హోవార్డ్ (1916-1999) బ్రిటన్కు చెందిన ప్రముఖ ఆంగ్లికన్ తత్త్వవేత్త, మహిళల పౌరోహిత్యానికి పాటుపడిన నాయకురాలు. ఈమె జీవితాన్ని థియాలజీ అధ్యయనానికి, క్రైస్తవ సమైక్యతకు, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ లో ప్రగతిశీలమైన మార్పులకు అంకితం చేసింది. ఈమె మహిళలల హక్కులకు జాతీయంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా పోరాడారు. 1986 నూతన సంవత్సర సత్కారాల్లో, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్కి, బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ కు చేసిన సేవలకుగాను ఈమెకు “డేమ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్” బిరుదు లభించింది. ఈమె ఆంగ్లికన్ చర్చి, క్రైస్తవ సమైక్యతా చర్చలపై చెరగని ముద్ర వేశారు. “మూవ్మెంట్ ఫర్ ది ఆర్డినేషన్ ఆఫ్ ఉమెన్” అనే ఉద్యమానికి ఈమె వ్యవస్థాపక సభ్యురాలు, అలాగే చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ జనరల్ సైనాడ్ లో ప్రముఖ శబ్దంగా ఈమె నివేదికలు, చరిత్రాత్మక నిర్ణయానికి బలమైన పునాదితో వాదించగా, మహిళలకు పౌరోహిత్యాన్ని అనుమతించాలని 1994లో చర్చి నిర్ణయించింది. అంతర్జాతీయంగా, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఫెయిత్ అండ్ ఆర్డర్ కమిషన్ లో వైస్-మోడరేటర్ గా సేవచేసిన మొదటి మహిళ ఈమే. ఈ పాత్రలో క్రైస్తవ విభాగాల మధ్య ఐక్యతకు ఎంతగానో తోడ్పడ్డారు. ఈ విధంగా, డేమ్ క్రిస్టియన్ హోవార్డ్ చర్చి, సమాజం, క్రైస్తవ సమైక్యతపై అమూల్యమైన ప్రభావాన్ని చూపించారు.
క్రిస్టియన్ 1916 సెప్టెంబర్ 5న ఇంగ్లాండ్ లో ఉన్నత కుటుంబములో జన్మించారు. ఈమె తండ్రి జెఫ్రీ హోవర్డ్ రాజకీయవేత్త కాగా, తల్లి ఎథెల్ క్రిస్టియన్ ఉన్నత కుటుంబానికి చెందినవారు. ఈమె చిన్న వయసులోనే అనేక వ్యక్తిగత విషాదాలు ఎదుర్కొన్నారు, ఈమెకు 15 ఏళ్ల వయసులో తల్లి తండ్రులు మరణించగా, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, ఈమె ఇద్దరు సోదరులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. 1943లో క్రిస్టియన్ థియాలజీ అభ్యసించి, ఒక ప్రత్యేక చర్చి డిప్లొమాను పొందారు.
క్రిస్టియన్ హోవర్డ్ ఆంగ్లికన్ చర్చిలో మహిళలు పౌరోహిత్యంలో చేరేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలాగే, వేర్వేరు క్రైస్తవ సంఘాల మధ్య ఐక్యత కోసం చేసే ప్రయత్నాలలో కూడా ఆమె కీలకంగా పాల్గొన్నారు. దీనిని “ఎక్యూమెనికల్ ఉద్యమం” అంటారు. ఈమెకు వ్యతిరేకైనా ప్రముఖ జార్జ్ ఆస్టిన్ కూడా, ఈమెను “ఒక గొప్ప వ్యక్తిత్వం గల క్రైస్తవ స్త్రీ,” అని ప్రశంసించారు. ఈమె అమ్మమ్మ రోసలిండా హోవర్డ్, శాంతియుతంగా, చట్టపరంగా మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడినవారు. క్రిస్టియన్ హోవర్డ్ కూడా ఆమె ఆదర్శాన్ని అనుసరిస్తూ, మహిళలు పౌరోహిత్యం పొందే హక్కు కోసం కృషి చేశారు. 1972లో ఈమె, చర్చి పాలనాధికార సంస్థ, జనరల్ సైనడ్ కోసం ఒక ముఖ్యమైన నివేదికను సిద్ధం చేసి, మహిళల పౌరోహిత్యానికి మద్దతు తెలిపారు. ఈమె ధర్మశాస్త్రంలో చర్చ్ డిప్లొమాను పొందారు, యార్క్ మిన్స్టర్ అనే ప్రముఖ దేవాలయంలో గౌరవపూరిత పదవిని స్వీకరించారు, 1970 నుండి 1985 వరకు జనరల్ సైనడ్ లో సభ్యురాలిగా సేవలందించారు, ప్రపంచవ్యాప్తంగా జరిగే ముఖ్యమైన చర్చి సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేగాక, విశ్వ క్రైస్తవ మండలికి చెందిన ఫెయిత్ అండ్ ఆర్డర్ కమిషన్ లో ఉపాధ్యక్షురాలిగా నియమించబడిన తొలి మహిళగా నిలిచారు.
క్రిస్టియన్ హోవర్డ్ 82 ఏళ్ల వయస్సులో ఇంగ్లాండ్లోని యార్క్ నగరంలో మరణించారు. మరణానికి కొంతకాలం ముందుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో, ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన స్నేహితులు ఈమెను సందర్శించారు. ఈమె ఆసుపత్రి గదిలో ఒక ఊదా రంగు టీ టవల్ కనిపించేది. దానిపై ఈమె జీవితాంతం మహిళల పౌరోహిత్య హక్కుల కోసం చేసిన పోరాటాన్ని సూచించే గుర్తు ఉండేది.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.
