మే 25, 1805
ఈ రోజు ప్రఖ్యాత క్రైస్తవ అపాలజిస్ట్, తాత్వికుడు విలియం పాలే అమెరికాలోని లింకన్షైర్ లో పరమపదించిన రోజు. ప్రకృతిలో ఉన్న నిర్మాణ క్రమం ఆధారంగా ఇతడు ఆస్తిక సమర్థనా వాదాన్ని రూపొందించాడు. మానవ శరీర నిర్మాణంలోని సంక్లిష్టత, విశ్వంలోని నిర్మాణ సంక్లిష్టత దేవుని ఉనికిని నిరూపించే సిద్ధాంతాలను సూత్రీకరించాడు పాలే. ఈయన సూత్రీకరించిన “గడియారం—నిర్మాణకుడు” ఉదాహరణ విశ్వ విఖ్యాతమయ్యింది.
కాలాన్ని శాసించే దేవుడు
“అతని టైం బాలేదండి, ఏం చేస్తాం!” “కాలమే నిర్ణయించాలి” “కాలమే గాయాన్ని మాన్పుతుంది”. ఇలాంటి మాటలు తరచూ వింటూ ఉంటాం. కాలానికి అంత సీన్ లేదు! కాలం సృష్టికర్త కాదు, అది సృష్టం మాత్రమే! అంచేత కాలం ఎవడ్నీ శాసించ లేదు, ఎవడికీ ఒకింత సాయం చేయలేదు. ఎవ్వరికీ అదృష్టాన్ని తెచ్చిపెట్ట లేదు. అరిష్టాన్ని అసలివ్వలేదు.