అస్సాంలో క్రైస్తవ ప్రార్ధనలపై నిఘా

అస్సాంలోని ఒక క్రైస్తవ హక్కుల సంస్థ ఆ రాష్ట్ర పోలీసులు సంఘాల్లోనికి చొరబడి సమాచారం సేకరించడంపై కలవరం వ్యక్తపరిచింది. ఇది విశ్వాసులను భయపెట్టదలిచే ఒక గూడచర్య పనిగా అభిప్రాయపడింది. రాష్ట్ర యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం (యు.సి.ఎఫ్.) వారు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని ఈ అసాధారణ గూఢచార పనిని తక్షణం నిలిపివేయాలని జిల్లా కమిషనర్ ను కోరారు.

క్రీస్తు మనస్తత్వం

మనస్తత్వం మనిషి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మనస్తత్వమే మనిషి ప్రవర్తనను శాసిస్తుంది. మనస్తత్వమంటే మనిషి ప్రవృత్తి, ఆలోచనా సరళి, వైఖరి—మనల్ని మనం చూసుకునే దృష్టి, ఇతరుల్ని చూసే దృష్టి. ప్రవృత్తిని బట్టే వృత్తి ఉంటుంది. ఆలోచనా సరళిని బట్టే ఆచరణా శైలి ఉంటుంది. మరి క్రీస్తు మనస్తత్వమంటే ఏంటి?

మతమార్పిడి కేసుపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు

శ్యామ్ హగ్గిన్బాటమ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ సైన్స్( SHUATS) వైస్ ఛాన్సలర్ ఐన రాజేంద్ర బిహారి లాల్ పై నమోదైన మత మార్పిడి నిరోధక కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను విచారిస్తున్న సుప్రీంకోర్టు మే 17న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మత మార్పిడి నిరోధక చట్టం 2021 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ యూపి మత మార్పిడి నిరోధక చట్టం 2021 లోని కొన్ని అంశాలు భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 25లో ఉన్న

కేపీ యోహన్నన్ కు పరలోక పిలుపు

గాస్పల్ ఫర్ ఆసియా సంస్థ వ్యవస్థాపకుడూ, అధ్యక్షుడూ ఐన కేపీ యోహన్నన్ అమెరికాలో గుండెపోటుతో పరమపదించారు. ఈ నెల 8, బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న వీరు మంగళవారం మార్నింగ్ వాక్ చేస్తూ కారు ప్రమాదానికి గురవ్వడంతో హుటాహుటిన వీరిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూనే ఆసుపత్రిలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మరణించినట్టు సమాచారం. ఈ సందర్భంగా “విశ్వాస పోరాటంలో చివరివరకూ నమ్మకంగా కొనసాగడానికి తన

టర్కీలో మసీదులుగా మారుతున్న చర్చీలు

టర్కీలో మసీదులుగా మారుతున్న చర్చీలు – టర్కీలోని చోరా ప్రాంతంలో ఐక్యరాజ్య సమితి వారసత్వ సంపదగా గుర్తించబడి, బైజాంటైన్ యుగానికి చెందిన పురాతన హోలీ సేవియర్ చర్చిని ఈ వారంలో ఆ దేశ అధ్యక్షుడు మరోసారి మసీదుగా మార్చి అధికారికంగా ప్రారంభించారు.

“బైబిల్” పేరును వాడుకుని చిక్కుల్లో పడ్డ నటి

“బైబిల్” పేరును వాడుకుని చిక్కుల్లో పడ్డ నటి – ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన గర్భ ధారణ సమయంలో తన సొంత అనుభవాలతో పాటు ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు సూచనలతో కూడిన పుస్తకానికి “కరీనాకపూర్ ఖాన్—ప్రెగ్నెన్సీ బైబిల్” అనే పేరు పెట్టడం వివాదాస్పదమైంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ విషయమై ఆమెకు లీగల్ నోటీస్ పంపడం జరిగింది.

క్రైస్తవ మనస్సాక్షి

మనస్సాక్షి వల్లనే లోకంలో ఇంకా కాస్తయినా మానవత్వం బ్రతికి ఉంది. మనస్సాక్షి వల్లనే ప్రతీ మనిషికీ తప్పొప్పులు తెలుస్తాయి (రోమా 2.14,15). మనస్సాక్షి మనిషికి దేవుడిచ్చిన వరం. నైతికతకు మూలాధారమైన దేవుడు మనిషిని “తన పోలికలో” సృష్టించాడు కాబట్టే సహజంగా మనిషికి నైతిక స్పృహ అబ్బింది. ఆ నైతిక స్పృహను కలిగించే అంతర్గత సామర్థ్యమే “మనస్సాక్షి”.

దేవునికి భయపడండి

నేడు క్రైస్తవంలో బాగా కొరవడింది అంటూ ఏదైనా ఉంది అంటే అది “దేవుని భయం” అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. అన్యులైనా వాళ్ళ దేవుళ్ళకు భయపడుతున్నారు గానీ మనలో చాలా మందికి ఆ స్పృహ లేదు. సంఘారాధన జరుగుతున్నపుడు మోగే సెల్ ఫోన్స్, వాక్య పరిచర్య జరుగుతున్నపుడు పక్క వారితో మాట్లాడే తీరు, ఓ పక్క వాక్య ప్రబోధం జరుగుతుంటే స్టేజ్ మీద కూర్చున్న అయ్యవార్లు మాట్లాడుకుంటున్న తీరు, ప్రార్థన మధ్యలో వచ్చి కాఫీ తాగుతారా అని అడగడం, రాజకీయ నాయకులు రాగానే ప్రసంగం మధ్యలో ఆపేసి, లేచి నిలబడి వారికి పెద్ద పీట వేయడం, దేవుని మందిరంలోనే కీచులాడుకోవడం, పైగా దాన్ని యూట్యూబ్ లో పెట్టడం వంటివి చూస్తుంటే దైవ భయం మనకు బొత్తిగా లేదని ఇట్టే చెప్పేయ వచ్చు. “లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను” (కీర్త.33:8) అని ఉంది. మన దేవుడి పట్ల మన వైఖరే ఇలా ఉంటే అన్యజనులు ఆయనకు ఎలా భయపడతారు?

అపవాదికి భయపడకండి

మన దేశం మూఢ నమ్మకాలకు పెట్టింది పేరు. తుమ్మితే అనర్థం, నల్ల పిల్లి ఎదురైతే అనర్థం, నర దిష్టి అనర్థం, ఇంట గోళ్ళు కత్తిరిస్తే అనర్థం, నోట “చావు” అంటే అశుభం, మంగళవారం అశుభం, నల్లరంగు అశుభం, అమావాస్య అశుభం, వితంతువు ఎదురొస్తే అశుభం, బుధవారం ఆడపిల్ల పుడితే అరిష్టం, కాకి తల మీద తన్నితే అరిష్టం, బల్లి మీదపడితే అరిష్టం, ఇలా ఒకటేమిటి, అనేకమైన మూఢ నమ్మకాలు మన తెలుగు రాష్ట్రాల్లో రాజ్యమేలుతున్నాయి. ఈ మూఢ నమ్మకాల వల్లనే అనేక భయాల్లో మనవాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దుర్ముహూర్త భయం, వాస్తు భయం, దిష్టి భయం, జాతకాల భయం, చేత బడి భయం, క్షుద్ర పూజల భయం. అన్నింటికీ మించి మరణ భయం!

ఇవ్వడం నేర్చుకుందాం

“కాసు” అంటే మూల భాషలో “లెప్టన్” అని ఉంది. నాటి రోమా సామ్రాజ్యంలో అతి తక్కువ విలువ ఉన్న నాణెం అది. మనకు పూర్వం కాసు అంటే దాదాపు అరపైసా. వాళ్ళకి ఆ నాడు కాసు అంటే దేనారంలో నూట ఇరవై ఎనిమిదో భాగం. దాదాపుగా విలువ లేని నాణెం. ఇలాంటి రెండు నాణేలను ఒక పేద వితంతువు కానుక పెట్టెలో వేయడం చూసిన ప్రభువు “ఈమె అందరికంటే ఎక్కువ వేసింది” అంటున్నాడు. అనేకమంది ధనవంతులు అప్పటికే పెద్ద మొత్తాలు కానుక పెట్టెలో వేస్తున్నారు (మార్కు 12.41). అది చూసినా ప్రభువు అతి తక్కువ ఇచ్చిన ఈ పేద మహిళను “ఎక్కువ ఇచ్చింది” అనడంలో అంతరార్థం ఏమిటి?