పాస్టర్ శామ్యూల్, బొబ్బిలి
వెరిటాస్ పాఠశాల సంఘాలకు, దైవజనులకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం. వెరిటాస్ ద్వారా సత్యాన్ని లేఖనం వెలుగులో సరిగా గ్రహించ గలిగాం. సత్య వాక్యాన్ని సరిగా విభజించడం నేర్చుకున్నాం.
వెరిటాస్ పాఠశాల సంఘాలకు, దైవజనులకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం. వెరిటాస్ ద్వారా సత్యాన్ని లేఖనం వెలుగులో సరిగా గ్రహించ గలిగాం. సత్య వాక్యాన్ని సరిగా విభజించడం నేర్చుకున్నాం.
నేను వెరిటాస్ ద్వారా చాలా ఆశీర్వదింపబడ్డాను. మేము కూడా పరిచర్యలో ఉన్నాం అయితే అనేక విషయాలు నాకు తెలియవు. కానీ వెరిటాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను బైబిల్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. అవి వ్యక్తిగతంగా నాకు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే సేవలో కూడా ఉపయోగపడ్డాయి. వాటిని నేను అనేకమందికి బోధించినప్పుడు మంచి ఫలం చూసాను. థాంక్యూ వెరిటాస్!
Veritas humbled me at the feet of Christ. It helped me understand more of God—His love and justice—in balance. I felt saved after attending Veritas sessions and the warm love of God in saving me from false doctrines. Now, I’m able to differentiate between right and wrong doctrines. I thank God for Veritas!
వెరిటాస్ క్లాసులు నాకు దేవుడిచ్చిన బహుమతి. ఇక్కడ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సంఘ పరిచర్య, సంఘ నిర్వహణ, కుటుంబ, వ్యక్తిగత సవాళ్లలో బైబిల్ ప్రకారం ఎలా నడవాలి, బైబిల్ ను సరైన రుజువులతో ప్రజలకు ఎలా చెప్పాలి, దర్బోధలను ఎలా ఎదిరించాలి వంటివి ఎన్నో తెలుసుకున్నాను. ముఖ్యంగా, క్రీస్తు బ్రతకడం తెలిసింది. పాస్టర్లు, పెద్దలు, కుటుంబం, స్నేహితుల కంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకున్నాను.
Veritas Bible Institute taught me how to read and interpret the Bible in a right manner. I have learnt many deeper spiritual truths at Veritas. The curriculum is comprehensive and contemporary and is relevant to the need of the hour. It is taught in a simple but systematic approach.
నేను వెరిటాస్ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన తర్వాత సత్య వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ముఖ్యంగా క్రీస్తు సిలువలో చేసిన త్యాగం, క్రైస్తవ జీవన విధానం, సమాజంలో చొరబడిన అబద్ధ బోధలు, బోధకులను ఎలా గుర్తించాలి, వాక్యాన్ని ఏ విధంగా చదవాలి, దానిని మన జీవితంలో ఏ విధంగా అలవర్చుకోవాలి, ఇతరులకు ఎలా పరిచయం చేయాలి, దేవుడు మన కోసం ఏం చేసాడు, మనం దేవుని కోసం ఏం చేయాలి… ఇలా ఎన్నో సత్యాలు తెలుసుకున్నాను. సత్య…
“All truth is God’s truth” అనే నినాదంతో వచ్చిన Veritas మా అందరికీ చేరువై మా జీవితాలను సత్యంతో నింపి మమ్మల్ని ధన్యుల్ని చేసింది. ఈ రోజుల్లో సత్యానికి సరైన భాష్యం చెప్పడంలో Veritas కు ఏదీ సాటి లేదనేది సత్యం. ప్రకాష్ గారు బైబిల్ ప్రబోధంతో మా హృదయాల్లో ప్రభువును ప్రతిష్టించిన వైనం ప్రశంసనీయం.
Undoubtedly, Veritas Bible Institute helped me a lot in interpreting the Word of God rightly. Group discussions and review classes gave me a boost. On the whole, it stands unique in imparting systematic study of the Bible and a wide range of topics that aid right analysis. I thank God for the Veritas.
నేను ఒకప్పుడు అన్యురాల్ని. రక్షణ పొందిన ఐదేళ్లకు వెరిటాస్ బైబిల్ స్కూల్లో చేరే అవకాశం దేవుడు కల్పించాడు. దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలనే తపనతో ఉన్న రోజుల్లో వెరిటాస్ పరిచయం అయ్యింది. ప్రకాష్ అన్న క్లాసుల్లో దేవుని ఉనికి, సంపూర్ణ స్వభావం ఆయన ప్రేమ, పవిత్రత ఇలా ఎన్నో గొప్ప సంగతులను నేర్చుకునే భాగ్యం దొరికింది. నశించి పోతున్న నన్ను వెదికి, విముక్తి చేయడానికి వచ్చిన ఆ క్రీస్తు ప్రేమను నేను వెరిటాస్ ద్వారా సంపూర్తిగా గ్రహించాను.…
నేను వెరిటాస్ సభ్యుడుగా ఉన్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈ కళాశాలలో ప్రకాష్ అన్న బోధించిన విధానం ద్వారా నాకు దేవుని వాక్యం లోతుగా చదవడం అలవాటుగా మారింది. ప్రశ్నించే పరిసయ్యలకు, శాస్త్రులుకు ప్రభువు ఎదురు ప్రశ్నల ద్వారా ఎలా జవాబు చెప్పారో వెరిటాస్ లో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఈ పాఠశాలలో దేవుని వాక్యంలో ఎంతో బలపడ్డాను. దేవునికి స్తోత్రం, మహిమ!