దైవ స్పృహ
దైవ స్పృహ నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?—కీర్తనలు 139:7 దేవుని సర్వ సన్నిధి గురించిన సుపరిచిత వచనం ఇది. దేవుడు సర్వాంతర్యామి అన్న నానుడి మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. నిజానికి సర్వాంతర్యామి అన్నది క్రైస్తవ ఆలోచన కాదు. అది అన్యాలోచన. విశ్వంలోని ప్రతీ వస్తువులో, ప్రతీ వ్యక్తిలో దేవుడు ఉంటాడని వారి అభిప్రాయం. పరిమితమైన ప్రపంచం అపరిమితమైన దేవుడ్ని తనలో ఇముడ్చుకోలేదు. అది అసాధ్యం! అందుకే పౌలు ఏథెన్స్ వాసులతో…