-
భయం లేని నమ్మకం
ఆదాము పాపం చేసినప్పటి నుంచీ భయం మనిషి జీవితంలో అంతర్భాగం అయిపోయింది (ఆది.3.10). భారతీయ జన సామాన్యంలో ఇది మరీ ఎక్కువ. తుమ్మినా భయం చిమ్మినా భయం, పిల్లి అంటే భయం బల్లి అంటే భయం, నలుపంటే భయం చీకటంటే భయం. మనకి వాస్తు భయాలు, శాప భయాలు, ముహూర్త భయాలు, జాతక భయాలు, దయ్యాల భయాలు, దిష్టి భయాలు ఉన్నాయి. ఇటువంటి సమాజంలో పుట్టి పెరిగిన క్రైస్తవులకూ ఈ భయాలు పట్టుకోవడం…
-
స్వీయ చిత్రం
ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన ప్రశ్నల్లో ఒకటి”నేనెవరిని?” అన్నది. నేడు కార్పొరేట్ ఉద్యోగాల్లో కూడా ఇంటర్వ్యూల్లో అడిగే మొదటి ప్రశ్న ఇదే. “ఓ మనిషీ, నిన్ను నీవు తెలుసుకో” అన్నారు ప్రాచీన తాత్వికులు. ఐతే మన ఆసక్తి వేరు. మనం మనల్ని తెలుసుకోవడం వదిలేసి పక్కింటి వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. పక్కవాళ్ళ జీవితాల్లోకి తొంగిచూడటం చాలా మందికి సరదా. ఇపుడు సోషల్ మీడియా నిండా ఇదే కంటెంట్! వాళ్లేమిటి? వీళ్లేమిటి? వాళ్ళ…
-
జీవన దీపం
కళ్ళు లేకపోతే పగలైనా రాత్రైనా ఒక్కటే. అంధుడికి దీపంతో పనిలేదు. కానీ కళ్ళున్న వాళ్లకు దీపం లేకుండా పనికాదు. వెలుగు లేకుండా కనబడదు. వెలుగు వస్తువులపైన పడి పరావర్తనం చెందితే తప్ప మన కంటి కటకాలు నేత్రపటలానికి బయటి చిత్రాల్ని చేరవేయ లేవు, అవి మెదడుకి చేరనూ లేవు. చూపుకు దీపం కావాలి. కంటికి వెలుగు కావాలి. ఇది ప్రకృతి నియమం!
-
స్నేహించే దేవుడు
“సృష్టిలో తీయనిది స్నేహమేనోయి. అది లేని జీవితం వ్యర్థమేనోయి” అన్నాడో కవి. మనిషితో మనిషి స్నేహం అంత తీయనిది ఐతే సాక్షాత్తూ దేవుడే మనిషితో స్నేహం చేస్తే అది ఇంకెంత తీయనిది! ఆ జీవితం ఇంకెంత సార్థకమైంది!