క్రైస్తవ వైవిధ్యం
“అన్నీ బాగుంటేనే దేవుడి ఆశీర్వాదం ఉన్నట్టు” అని భావించే వారికి ఈ వాక్యం ఒక చెంప పెట్టు. దేవుడు మన తండ్రి. ఆయన ఆలనాపాలనలో శిక్ష, సంరక్షణ రెండూ ఉంటాయి. మన తలిదండ్రులు చిన్నప్పుడు ప్రేమతో మనకు అడగకపోయినా అన్నీ అవసరాల్ని తీర్చేవారు. అదే సమయంలో అవసరమైనప్పుడు మనకు శిక్ష విధిస్తూ మనల్ని క్రమ శిక్షణ చేస్తారు కూడా. మన పరమ తండ్రి అంత కంటే గొప్ప తండ్రి!



