పౌలు తన సుదీర్ఘ సువార్త జైత్ర యాత్రలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాడు. “సువార్త గూర్చి నేను సిగ్గుపడువాడను కాను” సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి” , క్రీస్తు నెరుగుటయే నిత్య జీవం అని క్రీస్తే సెలవిచ్చారు. కృపాసువార్త, త మార్పిడి కోసం కాదు, మనిషిని మంచి మనిషిగా మార్చేది. అది రక్త పాతానికి దారి తీసేది కాదు, క్రీస్తు సిలువ రక్తం ద్వారా సర్వ శాంతిని నెలకొల్పేది.

సువార్త కోసం…

పౌలు తన సుదీర్ఘ సువార్త జైత్ర యాత్రలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాడు. అతని జీవితం, పరిచర్య కూడా దాదాపుగా చరమాంకానికి వచ్చేశాయి. మిలేతు పట్టణం చేరుకున్న పౌలు ఆ విషయం గ్రహించి ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించుకున్నాడు. వారితో ఆయన మాట్లాడిన మాటలు చాలా గంభీరమైనవి, బరువైనవి. అక్కడ నుండి యెరూషలేముకు వెళ్ళాల్సిన పౌలు అక్కడ తనకోసం కాచుకుని ఉన్న బంధకాలను, శ్రమలను ఆత్మ ద్వారా తెలుసుకుని ఈ మాటలు చెప్తున్నాడు

క్రైస్తవ విమర్శ

అసలు విమర్శించడమే తప్పు అన్నది కొందరి అభిప్రాయం. “మీరు విమర్శించకండి బ్రదర్!” అని చెప్తుంటారు కొందరు. “విమర్శించకండి…ఎందుకు విమర్శిస్తారు” అనడం కూడా విమర్శనే! విమర్శ అంటే లోతైన ఆలోచన, విశ్లేషణ, పరిశీలన, పరీక్ష, పరిశోధన,… ఇవీ అర్థాలు. అందువల్లనే పునర్విమర్శ, సద్విమర్శ, ఆత్మ విమర్శ, పూర్వ విమర్శ వంటి పదాలు ఎప్పట్నుంచో తెలుగులో వాడుకలో ఉన్నాయి. మానవ జీవితంలో విమర్శ అనివార్యం—అది పర విమర్శ ఐనా, ఆత్మ విమర్శ ఐనా! క్రైస్తవంలో ఇది మరింత సత్యం!

పిలుపు లేని పరిచర్య

పిలవని పేరంటానికి వెళ్లకూడదు అన్నది భారతీయుల పట్టింపు. ఆ మాటకొస్తే ఆత్మ గౌరవం ఉన్న ఎవ్వరూ పిలవని పెళ్లికి, పేరంటాలకు వెళ్ళరు. విచిత్రమేమిటంటే, ప్రభువు పిలవకుండానే “పరిచర్య” చేయడానికి విచ్చేసిన ప్రబుద్ధులు ఇప్పుడు మన క్రైస్తవంలో కోకొల్లలు. సోషల్ మీడియా వచ్చాక, “సెలబ్రిటీ సేవకులు” ఎక్కువయ్యాక చాలా మందికి దేవుని పిలుపు వచ్చేసింది. అదేవిటో గానీ ఆ పిలుపు సువార్తికులు గానో, సహాయకులు గానో అస్సలు రాదు. ఐతే పాస్టర్ గానో, లేకపోతే స్పీకర్ గానో దేవుడు పిలిచినట్టు చెబుతున్నారు. మరి ఇది లాభదాయక పరిచర్య కదా!

ప్రభుత్వాలన్నీ దేవుడివే

ఇండియాలో ఎన్నికల పర్వం ముగిసింది. దేశమంతా నెలకొన్న ఉత్కంఠకు దాదాపుగా తెర పడింది. కొందరి ఆశలు అడియాశలయ్యాయి. కొందరి నిస్పృహలు ఆశలుగా చిగురించాయి. క్రైస్తవులు, ఇతర మైనారిటీలు ఫలానా వాళ్ళు అధికారంలోకి వస్తే బావుండు అని ఆశపడ్డారు. అనేకమంది క్రైస్తవులు రాబోయే ప్రభుత్వాల గురించి ప్రార్థనలు చేశారు, చేస్తున్నారు.