1915 January 22

Anna Bartlett Warner (1827–1915) was an American hymn writer and author. She is best known for writing the children’s hymn “Jesus Loves Me,” which became one of the most beloved Christian hymns worldwide, often sung by children and cherished for its simplicity and profound message of Christ’s love.

1915 జనవరి 22

అన్నా బార్ట్ లెట్ వార్నర్ (1827-1915) ఒక అమెరికన్ హిమ్న్ రచయిత, గ్రంథకర్తగా . ఈమె “జీసస్ లవ్స్ మీ” అనే బాలల గీత రచయితగా సుప్రసిద్ధ మయ్యారు. ఈ గీతము ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘాల్లో అత్యంత ప్రాచుర్యం పొందినది.

1221 ఆగస్ట్ 06

రోమన్ కాథలిక్ సంఘ బోధనా క్రమాలలో ప్రముఖమైన డొమినికన్ ఆర్డర్ రూపకర్త, స్పెయిన్ కు చెందిన మతగురువు సెయింట్ డొమినిక్ పరమపదించిన రోజు ఈ రోజు.

పరమ తండ్రే మనకు ఆదర్శం

కుటుంబ బాధ్యతల్లో తండ్రి పాత్ర అత్యంత కీలకమైంది, ప్రాముఖ్యమైంది కూడా. జాతి నిర్మాణంలో కుటుంబ పాత్ర మౌళికమైంది. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు. ఆ పౌరులు కుటుంబంలోనే తయారవుతారు. ఆ కుటుంబానికి రథసారథి తండ్రి. నాయకుడైనా, నేరస్తుడైనా కుటుంబం నుంచే రావాలి. నీతి నిజాయితీ ఉన్న పౌరులైనా, నీతిమాలిన సంఘవిద్రోహ శక్తులైనా కుటుంబం నుంచే వస్తారు. కుటుంబంలో తండ్రి ఎలాంటి పాలన చేస్తాడు అన్నదాని మీదే పిల్లల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. తండ్రి బా అంత గురుతరమైనది. దేశానికి ఆయువుపట్టు తండ్రి ఐతే కుటుంబానికి ఆయువుపట్టు తండ్రే!

క్రీస్తు మనస్తత్వం

మనస్తత్వం మనిషి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మనస్తత్వమే మనిషి ప్రవర్తనను శాసిస్తుంది. మనస్తత్వమంటే మనిషి ప్రవృత్తి, ఆలోచనా సరళి, వైఖరి—మనల్ని మనం చూసుకునే దృష్టి, ఇతరుల్ని చూసే దృష్టి. ప్రవృత్తిని బట్టే వృత్తి ఉంటుంది. ఆలోచనా సరళిని బట్టే ఆచరణా శైలి ఉంటుంది. మరి క్రీస్తు మనస్తత్వమంటే ఏంటి?

ఇవ్వడం నేర్చుకుందాం

“కాసు” అంటే మూల భాషలో “లెప్టన్” అని ఉంది. నాటి రోమా సామ్రాజ్యంలో అతి తక్కువ విలువ ఉన్న నాణెం అది. మనకు పూర్వం కాసు అంటే దాదాపు అరపైసా. వాళ్ళకి ఆ నాడు కాసు అంటే దేనారంలో నూట ఇరవై ఎనిమిదో భాగం. దాదాపుగా విలువ లేని నాణెం. ఇలాంటి రెండు నాణేలను ఒక పేద వితంతువు కానుక పెట్టెలో వేయడం చూసిన ప్రభువు “ఈమె అందరికంటే ఎక్కువ వేసింది” అంటున్నాడు. అనేకమంది ధనవంతులు అప్పటికే పెద్ద మొత్తాలు కానుక పెట్టెలో వేస్తున్నారు (మార్కు 12.41). అది చూసినా ప్రభువు అతి తక్కువ ఇచ్చిన ఈ పేద మహిళను “ఎక్కువ ఇచ్చింది” అనడంలో అంతరార్థం ఏమిటి?

మా, తుజే సలాం

తల్లిని ప్రేమించడం, గౌరవించడం ‘మదర్స్ డే’ కి పరిమితం కాకూడదు. ఆమె మన బ్రతుకంతటికీ తల్లి—చిన్నప్పుడు పెద్ద వాళ్ళమైనప్పుడు, మనకు పెళ్లి అయ్యాక పెళ్లి కాకమునుపు, ఆమె మనకు సాయం చేసేటప్పుడు, మన సాయం ఆమెకు అవసరం అయినప్పుడు—అమ్మ మనకు అమ్మే! దేవుడి తర్వాత—అమ్మ మనకంత విలువైనది, ఆమె ప్రేమ అంత పవిత్రమైనది, ఆమె అంత గౌరవం పొందతగింది.

భక్తి – తృప్తి

“భక్తి” అంటే వల్లమాలిన ప్రేమ. గౌరవ ప్రదమైన ప్రేమ. “దైవ భక్తి” అంటే దేవుడ్ని ప్రేమించడం. దేవుడ్ని సమున్నతంగా, సంపూర్ణంగా ప్రేమించడం. అన్నింటికీ మించి, అందరికీ మించి నా సర్వస్వాన్ని అర్పిస్తూ ఆయన్ను ప్రేమించడం. ఇలాంటి భక్తిలో సంతోషం, సంతృప్తి సహజంగానే ఉంటాయి. ఈ భక్తి గొప్ప లాభాన్ని చేకూరుస్తుంది. శాశ్వత ఆశీర్వాదాన్ని మన సొంతం చేస్తుంది.