జాన్ హల్లియర్, (1520 – 1556) తాను నమ్మిన విశ్వాసం నిమిత్తం, సత్యం లోనే నిలబడి, ప్రాణం ఇచ్చిన ధైర్యవంతుడు. ఈయన ఇంగ్లాండులో ఆంగ్ల క్రైస్తవ చరిత్ర అస్థిర కాలంలో ఉన్న గొప్ప బోధకుడు. ఈయన బలిదానం ఆంగ్ల సంస్కరణ చరిత్రలో ఒక పదునైన అధ్యాయం. ఈయన త్యాగం ఆంగ్ల మత చరిత్ర చీకటి కాలాలలో ఒకటైన ప్రొటెస్టంట్ విశ్వాసాన్ని సమర్థించిన వారి ధైర్యం, విశ్వాసానికి శక్తివంతమైన సాక్ష్యంగా గుర్తుంచుకోబడుతుంది.
John Hullier, (1520 – 1556) was an English clergyman during the volatile period of English religious history and a Protestant martyr under Mary I of England. His martyrdom is a poignant chapter in the history of the English Reformation. His sacrifice is remembered as a powerful testimony to the courage and conviction of those who upheld the Protestant faith during one of the darkest periods of English religious history.
క్వీన్ ఎలిజబెత్ I (1533–1603) ఈమె 1558 నుండి మరణించే వరకు ఇంగ్లండ్ – ఐర్లాండ్లను పాలించింది, ట్యూడర్ రాజవంశంలో చివరి మరియు ఎక్కువ కాలం పాలించిన, వర్జిన్ క్వీన్ అని పిలువబడే ఈమె వివాహం చేసుకోలేదు. పురుషాధిక్య ప్రపంచంలో తన అధికారాన్ని నైపుణ్యంగా కొనసాగించింది. ఇంగ్లండ్ లో ప్రొటెస్టంటిజాన్ని దృఢంగా స్థాపించడంలో కీలక పాత్ర పోషిం చెను. ప్రొటెస్టంట్ లను ఘోరాతి ఘోరంగా హింసించిన ఈమె కాథలిక్ సోదరి, మేరీ.I పాలన తర్వాత, ఎలిజబెత్ కాథలిక్ పునరుద్ధరణను తిప్పికొట్టి, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ను తిరిగి స్థాపించింది. ఈమె సర్వోన్నత చట్టాన్ని ఆమోదించి, తనను తాను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సుప్రీం గవర్నర్గా చేసింది, పాపల్ అధికారాన్ని తిరస్కరించింది. ఈమె ఇంగ్లీష్ బైబిల్ అనువాదాలను, ప్రొటెస్టంట్ బోధనలను ప్రోత్సహించింది.
Queen Elizabeth I (1533–1603) ruled England and Ireland from 1558 until her death in 1603 and was the last and the longest reigning monarch of the Tudor dynasty. Known as the Virgin Queen, she never married or left heirs and skilfully maintained authority in a male-dominated world. She played a crucial role in firmly establishing Protestantism in England. After the reign of her Catholic sister, Mary I (Bloody Mary), who persecuted Protestants, Elizabeth reversed the Catholic restoration and re-established the Church of England.
థామస్ క్రాన్మెర్ (1489–1556) కాంటర్ బరీకి మొదటి ప్రొటెస్టంట్ ఆర్చ్ బిషప్, ఆంగ్ల సంస్కరణలో కీలక వ్యక్తి. ఈయన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు, ముఖ్యంగా కింగ్ హెన్రీ VIII మరియు ఎడ్వర్డ్ VI ఆధ్వర్యంలో. కేథరీన్ ఆఫ్ అరగాన్ నుండి కింగ్ హెన్రీ VIII తన రద్దును పొందడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు, ఇది రోమ్ నుండి ఇంగ్లాండ్ విడిపోవడానికి దారితీసింది. ఈయన రాచరిక ఆధిపత్యానికి మద్దతు ఇచ్చాడు. కాంటర్‌బరీ, ఆర్చ్ బిషప్‌గా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, సిద్ధాంతపరమైన, ప్రార్ధనా పునాదులను వేశాడు.
Thomas Cranmer (1489–1556) was the first Protestant Archbishop of Canterbury and a key figure in the English Reformation. He played a central role in shaping the Church of England, particularly under King Henry VIII and Edward VI. He played a key role in securing King Henry VIII’s annulment from Catherine of Aragon, leading to England’s break from Rome. He supported royal supremacy and, as Archbishop of Canterbury, laid the doctrinal and liturgical foundations of the Church of England. Under Edward VI, he advanced Protestant reforms, compiling the Book of Common Prayer and changing church doctrines.