బలహీనత యందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా ...నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును, క్రైస్తవ వైవిధ్యం

క్రైస్తవ వైవిధ్యం

“అన్నీ బాగుంటేనే దేవుడి ఆశీర్వాదం ఉన్నట్టు” అని భావించే వారికి ఈ వాక్యం ఒక చెంప పెట్టు. దేవుడు మన తండ్రి. ఆయన ఆలనాపాలనలో శిక్ష, సంరక్షణ రెండూ ఉంటాయి. మన తలిదండ్రులు చిన్నప్పుడు ప్రేమతో మనకు  అడగకపోయినా అన్నీ అవసరాల్ని తీర్చేవారు. అదే సమయంలో  అవసరమైనప్పుడు మనకు శిక్ష విధిస్తూ మనల్ని  క్రమ శిక్షణ చేస్తారు కూడా. మన పరమ తండ్రి అంత కంటే గొప్ప తండ్రి! 

ప్రభువునెరిగిన భక్తి

యోబుకు కష్టాలు ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చి పడ్డాయి. ఆస్తి నష్టమే కాదు, ఆరోగ్యమూ ఆవిరైపోయింది. బిడ్డల్ని పోగొట్టుకున్న కడుపు కోత పిండేస్తోంది. ఆదరించాల్సిన స్నేహితులు అనరాని మాటలు అంటున్నారు. భార్య సహకారం అంతంత మాత్రమే. అంతటి భాగ్యవంతుడు, భక్తుడు ఒక్కసారిగా ఏకాకి అయిపోయాడు. దేవుడు కూడా వదిలేశాడా అనిపించే నిరాశ, నిస్పృహ ఆవహిస్తున్న పరిస్థితి. కానీ యోబులో ఆశ చావలేదు. అతనిలోని భక్తుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. అతని విశ్వాసం అంతరించి పోలేదు. అతడు దేవుడ్ని అనుమానించ లేదు. “నా విమోచకుడు సజీవుడు” అంటున్నాడు. ఆయన్ని “నేను ఎరుగుదును” అంటున్నాడు. నా చర్మం చివికిపోయినా సరే, ఈ దేహంలోనే ఆయన్ను చూస్తాను. నా మట్టుకు నేనే చూస్తాను. నా దేవుడ్ని నా కన్నులారా చూస్తాను. నా రక్షకుడు వస్తాడు. నా పక్షాన నిలుస్తాడు —అంటున్నాడు యోబు (19.25-27).

భక్తి – తృప్తి

“భక్తి” అంటే వల్లమాలిన ప్రేమ. గౌరవ ప్రదమైన ప్రేమ. “దైవ భక్తి” అంటే దేవుడ్ని ప్రేమించడం. దేవుడ్ని సమున్నతంగా, సంపూర్ణంగా ప్రేమించడం. అన్నింటికీ మించి, అందరికీ మించి నా సర్వస్వాన్ని అర్పిస్తూ ఆయన్ను ప్రేమించడం. ఇలాంటి భక్తిలో సంతోషం, సంతృప్తి సహజంగానే ఉంటాయి. ఈ భక్తి గొప్ప లాభాన్ని చేకూరుస్తుంది. శాశ్వత ఆశీర్వాదాన్ని మన సొంతం చేస్తుంది.