మా, తుజే సలాం

తల్లిని ప్రేమించడం, గౌరవించడం ‘మదర్స్ డే’ కి పరిమితం కాకూడదు. ఆమె మన బ్రతుకంతటికీ తల్లి—చిన్నప్పుడు పెద్ద వాళ్ళమైనప్పుడు, మనకు పెళ్లి అయ్యాక పెళ్లి కాకమునుపు, ఆమె మనకు సాయం చేసేటప్పుడు, మన సాయం ఆమెకు అవసరం అయినప్పుడు—అమ్మ మనకు అమ్మే! దేవుడి తర్వాత—అమ్మ మనకంత విలువైనది, ఆమె ప్రేమ అంత పవిత్రమైనది, ఆమె అంత గౌరవం పొందతగింది.