1908 ఫిబ్రవరి 07

సుసన్నా కార్సన్ రిజనహార్ట్ (1868-1908) కెనడా దేశము, అంటారియో, చాతం పట్టణమునకు చెందిన వైద్యురాలు, వైద్య మిషనరీ. ఈమె వ్యక్తిగత నష్టం, కఠినతరము, ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, ఈమె తన పిలుపుకు లోబడి మిషన్కు కట్టుబడి ఉంది.

1913 January 21

Fanny Jackson Coppin (1837–1913) was a notable African-American educator, missionary, and advocate for racial and gender equality. She stands as a symbol of triumph over adversity, breaking barriers at a time when education for women, especially African-American women was almost non-existent.

1913 జనవరి 21

ఫ్యానీ జాక్సన్ కాపిన్ (1837–1913) అమెరికాలో ఉన్న ఆఫ్రికా జాతికి చెందిన ప్రముఖ వున్నత విద్యావేత్త. జాతి, లింగ సమానత్వం కోసం పాటుపడిన న్యాయవాది. ముఖ్యంగా ఆఫ్రికన్-అమెరికన్ మహిళలకు విద్య దాదాపుగా లేని సమయంలో ఈమె అడ్డంకులను బద్దలు కొట్టి, గెలిచిన ధీశాలి.

1883 నవంబర్ 9

ఈరోజు భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో పరిచర్య చేసి, ఇతోధిక సేవలు అందించిన మైల్స్ బ్రాన్సన్ గారు ప్రభువు పిలుపు అందుకున్న రోజు (09-11-1883).

అందరికీ మంచి చేద్దాం

క్రైస్తవం స్వార్థ పరాయణత్వంతోనో, మత మౌఢ్యంతోనో ఆవిర్భవించిన విశ్వాసం కాదు. క్రైస్తవం ఇచ్చి వేసుకునే విశ్వాసం. ఆదిమ సంఘంలో విశ్వాసులు తమలోని అక్కర ఉన్న ప్రతి ఒక్కరికీ ఆస్తులను పంచి పెట్టారు(అపో.2.44-45). మన దేవుడు ఇచ్చే దేవుడు, నిలువు దోపిడీ చేసే దేవుడు కాదు. మన దేవుడు లోకాన్ని ప్రేమించి, లోక రక్షణ కోసం తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చివేసిన దేవుడు (యోహా. 3.16). తాను దొంగిలించడానికి రాలేదని, ప్రాణాన్ని పణంగా పెట్టడానికి వచ్చానని, పరిపూర్ణ జీవితాలను ప్రసాదించడానికి వచ్చానని చెప్పారు మన ప్రభువు (యోహా. 10.10-16). ఆయన మన కోసమే కాదు. లోకమంతటి కోసం సిలువలో ప్రాణత్యాగం చేశాడని వాక్యం చెబుతోంది (1 యోహా. 2.2). ఐనా ఎందుకోగానీ, త్యాగపూరిత దాతృత్వం భారతీయ క్రైస్తవులకు ఇంకా అబ్బలేదు. మణిపూర్ బాధితులకు మీరెంత సాయం చేశారు అని మొన్నీమధ్య ఒక ధనిక క్రైస్తవ వర్గాన్ని ప్రశ్నించాను. ఎవరూ జవాబు చెప్పలేదు.