1873 మే 01
Dr. లివింగ్ స్టోన్ (1813-1873) ప్రపంచములోనే గొప్పపేరున్న, స్ఫూర్తిదాయక వ్యక్తిత్వంతో ఆఫ్రికాను అన్వేషించిన మిషనరీ. ఈయన 1813 మార్చి 19న స్కాట్లాండ్లోని బ్లాంటైర్ అనే ఊరిలో ఓ సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించాడు. పదవ ఏట నుంచే పత్తి కర్మాగారంలో రోజంతా కష్టపడుచూ, రాత్రివేళల్లో చదువును కొనసాగించాడు. ఈయన తండ్రి ఒక నిబద్ధమైన క్రైస్తవుడు కావడం వల్ల, చిన్నప్పటి నుంచే క్రైస్తవ బోధనలు, శాస్త్రంపై ఆసక్తి, ప్రకృతి, ప్రేమ, ఇలా అన్నీ కలిసి ఈయనలో విశ్వాసం మరియు శాస్త్ర విజ్ఞానాన్ని సమన్వయించాలనే ఆకాంక్షను కలిగించాయి. ఈయన గ్లాస్గో నగరంలోని ఆండర్సన్ విశ్వవిద్యాలయం, చారింగ్ క్రాస్ ఆసుపత్రిలో వైద్యశాస్త్రం, వేదాంత శాస్త్రాన్ని అభ్యసించాడు. మొదట్లో ఈయన మిషనరీగా చైనాకు వెళ్లాలనుకున్నాడు, కానీ అప్పట్లో జరిగిన అపియం యుద్ధం వలన రద్దయినది.