జోహాన్ లియోన్హార్డ్ డోబర్ (1706–1766) జర్మన్ మిషనరీగా కరీబియన్లో బానిసలుగా ఉన్న ఆఫ్రికన్ల మధ్య తన మిషన్ సేవకు బాగా ప్రసిద్ది చెందాడు. ఈయన మొరవియన్ చర్చి మిషన్ ఉద్యమ మార్గదర్శక సభ్యులలో ఒకరు. ఈయన సువార్త ప్రకటించడానికి అవసరమైతే తమను తాము బానిసలుగా అమ్ముకోవడానికి కూడా సిద్ధపడ్డారు, కానీ తెల్ల బానిసత్వం నిషేధించబడింది. ఈయన మొరావియన్ చర్చిలో నాయకుడై బిషప్గా సేవ చేశాడు.
Johann Leonhard Dober (1706–1766) was a German missionary and one of the pioneering members of the Moravian Church’s mission movement. He is best known for his mission work among enslaved Africans in the Caribbean. He Joined the Moravian movement led by Count Nikolaus Ludwig von Zinzendorf. They were even willing to sell themselves into slavery if necessary to preach the Gospel. But white slavery was prohibited. He became a leader in the Moravian Church and served as a bishop.
రిచర్డ్ అలెన్ (1760–1831) ఆఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ (AME) చర్చి స్థాపకుడు, యునైటెడ్ స్టేట్స్ లో మొట్టమొదటి స్వతంత్ర నల్లజాతి వర్గానికి చెందినవాడు. ఈయన 1794లో ఫిలడెల్ఫియాలో తన మొదటి AME చర్చి “మదర్ బెతెల్”ని ప్రారంభించాడు. 1816లో మొదటి AME బిషప్గా, జాతి అణచివేత లేకుండా స్వేచ్ఛా నల్లజాతీయులు పూజించగలిగే ఒక వర్గాన్ని నిర్వహించడంపై దృష్టి సారించాడు, ఆదివారపు పాఠశాలల ద్వారా అక్షరాస్యతను ప్రోత్సహించాడు, రాజకీయ వ్యూహాలను అభివృద్ధి చేయడానికి జాతీయ సంస్థలను ప్రోత్సహించాడు. ఈయన బానిసలుగా ఉన్న నల్లజాతీయులతో ఐక్యతకు కట్టుబడి, తాత్కాలిక ప్రయోజనాలపై భాగస్వామ్య పోరాటాన్ని నొక్కి చెప్పాడు. దక్షిణ యునైటెడ్ స్టేట్స్లో విముక్తి పొందిన నల్లజాతీయులలో AME చర్చి గణనీయంగా పెరిగింది.
Richard Allen (1760–1831) was a minister and the founder of the African Methodist Episcopal (AME) Church, the first independent Black denomination in the United States. He opened his first AME church, “Mother Bethel” in 1794 in Philadelphia. As the first AME Bishop in 1816, he focused on organizing a denomination in which free black people could worship without racial oppression, promoted literacy through Sabbath schools, and also promoted national organizations to develop political strategies. Committed to unity with enslaved Blacks, he emphasized shared struggle over temporary advantages.
నేటి విశ్వాస నాయకుడుసహూ. V క్రిష్టాఫర్ గారుపరలోక పిలుపు : 18 మార్చి, 2007నమ్మకమైన దైవ సేవకుడు, సువార్తికుడు, ఆత్మల విజేత. సహూదరుడు వర్ధనపు క్రిష్టాఫర్ గారు (1928-2007) గొప్ప పేరున్న దేవుని సేవకునిగా గోదావరి జిల్లాల లోను, సహవాసములోను తెలియనివారులేరు. ఈయన రక్షింపబడినప్పటి నుండి ఆత్మల బారముతో సువార్త పరిచర్య చేయుచుండెడివారు. ఈ భారముతో ప్రభువు కొరకు ఈయన సంపాదించిన ఆత్మలు అనేకం. సహవాసములో ఉభయ గోదావరి జిల్లాలలో భీమవరము మొదటి సంఘము. ఈ సంఘములో…
Bro. Vardhanapu Christopher (1928-2007), a servant of God of great renown, was well known in the Godavari districts and among the fellowship. Since the time of his salvation, he preached the Gospel with a great burden for perishing souls. With this burden, he won many souls for the Lord. In the fellowship, the first church in the East and West Godavari districts was established in Bhimavaram. In this church, as a disciple of Bro. Aravindam, he inherited the ministry, laboured faithfully, and many were blessed by the fruits of his toil and service. He was a man of great humility, believing that suffering hardships for the Lord was good, and he led an exemplary life as a lowly and humble servant of God.
జార్జ్ ముల్లర్ (1805-1898) గొప్ప క్రైస్తవ మత ప్రచారకుడు, ఇంగ్లాండ్, బ్రిస్టల్లో యాష్లే డౌన్ అనాథాశ్రమ స్థాపకుడు. ఈయన దేవుని ఏర్పాటుపై అచంచలమైన విశ్వాసానికి ప్రసిద్ధి గాంచాడు. ఎప్పుడూ విరాళాల మీద ఆధారపడలేదు, కానీ వేలాది మంది అనాథల అవసరాలను తీర్చడానికి ప్రార్థనపై మాత్రమే ఆధార పడేవాడు. తన జీవితకాలంలో, ముల్లర్ 10,024 మంది అనాథలను చూసుకున్నాడు. ఈయన 117 పాఠశాలలను స్థాపించాడు, ఇవి 120,000 కంటే ఎక్కువ మంది క్రైస్తవ విద్యను అందించాయి. ఈయన ప్లైమౌత్ బ్రదర్న్ ఉద్యమ స్థాపకులలో ఒకడు. తరువాత విభజన సమయంలో, ఈయన బృందాన్ని ఓపెన్ బ్రదరెన్ అని పిలిచారు.
George Muller (1805–1898) was a Christian evangelist and the founder and director of Ashley Down orphanage in Bristol, England. He is best known for his unwavering faith in God’s provision, never soliciting donations directly but relying solely on prayer to meet the needs of thousands of orphans. Throughout his lifetime, Müller cared for over 10,024 orphans. He established 117 schools which offered Christian education to more than 120,000. He was one of the founders of the Plymouth Brethren movement. Later during the split, his group was called the Open Brethren.
జేమ్స్ కేల్వెర్ట్ (1813–1892) ఫిజీ దీవుల్లో దైర్యంగా క్రైస్తవ్యమును వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ మిషనరీ. ఆ కాలములో, ఫిజీ హింసాత్మక గిరిజన యుద్ధానికి, నరమాంస భక్షకానికి ప్రసిద్ధి చెందింది. ప్రజలకు సువార్తను పరిచయం చేయడానికి కేల్వెర్ట్ అంకితభావంతో, చాలా ధైర్యంగా సేవచేశాడు. శత్రుత్వం, అనారోగ్యం, తన ప్రాణాలకు బెదిరింపులను ఎదుర్కొన్నప్పటికీ, ఈయన ప్రభువు పిలుపులో స్థిరంగా ఉన్నాడు. 1854లో నరమాంస భక్షణను త్యజించి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి శక్తివంతమైన ఫిజియన్ చీఫ్ రతు సెరు ఎపెనిసా కాకోబౌను ప్రభావితం చేయడం ఈయన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి. 1872లో ఫిజీని విడిచిపెట్టిన తర్వాత, ఈయన తన చివరి సంవత్సరాల వరకు ఆఫ్రికాలో తన మిషనరీ పనిని కొనసాగించాడు.
James Calvert (1813–1892) was a devoted British Methodist missionary who played a crucial role in spreading Christianity in Fiji. At the time, Fiji was known for its violent tribal warfare and cannibalism. Calvert worked courageously to introduce the gospel to the people. Despite facing hostility, illness, and threats to his life, he remained steadfast in his calling. One of his most significant achievements was influencing Ratu Seru Epenisa Cakobau, a powerful Fijian chief, to renounce cannibalism and embrace Christianity in 1854. After leaving Fiji in 1872, he continued his missionary work in Africa till his last years.