1823 మార్చి 07

విలియం వార్డ్ (1769–1823) ఇంగ్లాండు దేశము నుండి ఇండియాకు వచ్చిన బాప్టిస్ట్ మిషనరీ. ఈయన, విలియం క్యారీ, జాషువా మార్ష్ మాన్ లతో పాటు సెరాంపూర్ త్రయం యొక్క ముఖ్య సభ్యుడు. బైబిళ్లు, కరపత్రాలు, క్రైస్తవ సాహిత్యం, విద్యా పుస్తకములు, బహుళ భారతీయ భాషలలో ముద్రించటం, ప్రచురణకర్తగా అందుబాటులో ఉంచడం ఈయన నైపుణ్యం ద్వారా సువార్తను వ్యాప్తి చేయడంలో సహాయపడింది. ముఖ్యంగా భారతదేశంలోనే ప్రధానమైన బెంగాల్లోని సెరాంపూర్ మిషన్లో ప్రింటింగ్ వ్యవస్థను కీలకంగా ఈయనే నిర్వహించేవాడు. ఇంతకు మించి ఈయన క్రైస్తవ మతాన్ని బోధించడం, వ్యాప్తి చేయడంలో చురుకుగా నిమగ్నమయ్యాడు. హిందూ ఆచారాలు, సంప్రదాయాలపై తన లోతైన అధ్యయనం భారతీయ ప్రజలకు క్రైస్తవ బోధనలను మరింత ప్రభావవంతంగా తెలియజేయడానికి వీలు కల్పించింది.

1823 March 07

William Ward (1769–1823) was an English Baptist missionary and a key member of the Serampore Trio, alongside William Carey and Joshua Marshman. His expertise as a printer and publisher helped spread the gospel by making Bibles, tracts, and educational materials available in multiple Indian languages. He played a crucial role in printing and publishing Christian literature in India, particularly at the Serampore Mission in Bengal, where he managed the Serampore printing press, the first major Protestant printing house in India. Beyond printing, he actively engaged in preaching, teaching, and spreading Christianity.

1792 ఫిబ్రవరి 27

శామ్యూల్ నీలె (1729–1792) ఐర్లాండ్కు చెందిన క్వేకర్ సువార్తికుడు, ఈయన లోతైన ఆధ్యాత్మిక నిబద్ధత, శక్తివంతమైన బోధనకు పేరుగాంచాడు. ఈయన బ్రిటన్, అమెరికాలలో క్రైస్తవ విశ్వాసాన్ని వ్యాప్తి చేయడానికి విస్తృతంగా ప్రయాణించి ప్రభావవంతమైన బోధకుడు అయ్యాడు. ఈయన ముఖ్యంగా ఆధ్యాత్మిక మేల్కొలుపు, విశ్వాసుల అంతర్గత జీవితానికి సంబంధించినవాడు. ఈయన దృష్టి సామూహిక మతమార్పిడులపై కాక, ఇప్పటికే ఉన్న క్వేకర్ ఉద్యమంలో లోతైన ఆధ్యాత్మిక జీవితానికి, పునరుద్ధరణకు, వ్యక్తులకు, సంఘాలకు పిలుపునివ్వడంపై ఉండేది.

1792 February 27

Samuel Neale (1729–1792) was a Quaker evangelist from Ireland known for his deep spiritual commitment and powerful preaching. He became an influential preacher, traveling extensively to spread the Christian faith, including journeys to Britain and America. He was particularly concerned with spiritual awakening and the inner life of believers. His focus was not on mass conversions but on calling individuals and communities to a deeper spiritual life and renewal within the existing Quaker movement.

2018 ఫిబ్రవరి 21

బిల్లీ గ్రాహం (1918-2018) అమెరికాకు చెందిన, ప్రపంచ ప్రఖ్యాత సువార్తికుడు, ఈయన శక్తివంతమైన బోధన, ప్రపంచ సువార్త క్రూసేడ్లకు పేరుగాంచాడు. దాదాపు ఏడు దశాబ్దాలుగా, 185 దేశములలో సువర్తికునిగా పర్యటించి దాదాపు 210 మిలియన్ల ప్రజలకు సువార్త ప్రకటించి లక్షలాది మందిని ప్రభువు వైపు నడిపించిన గొప్ప దైవజనుడు, ఈ బిల్లి గ్రేహం గారు.

2018 February 21

Billy Graham (1918–2018) was a prominent American evangelist known for his powerful preaching and global evangelistic crusades. Over nearly seven decades, he preached to millions across 185 countries, emphasizing salvation through Jesus Christ. His ministry reached people through radio, television, and books, making him one of the most influential Christian leaders of the 20th century.

1951 January 29

Evan John Roberts (1878–1951) was a Welsh revivalist and central figure in the 1904–1905 Welsh Revival, a significant spiritual awakening in Wales that impacted the broader evangelical world. His four principles of revival were, Confess all the known sin, Remove anything doubtful from one’s life, Be fully obedient to the Holy Spirit and Publicly confess Christ.

1951 జనవరి 29

ఇవాన్ జాన్ రాబర్ట్స్ (1878-1951), “వెల్ష్ 1904-1905 ఉజ్జీవ ఉద్యమం”లో ప్రధాన వ్యక్తి, ఈయన నాయకత్వంలో వేల్స్ లో విస్తృత సువార్త ప్రకటించటం ద్వారా, నెలకొల్పిన ఆత్మీయ మేల్కొలుపు ముఖ్యంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసింది.