Bro Sanjeeva Jnana Appaji, respectfully addressed as "Appaji", was widely known to everyone since the 1950s. Appaji’s Treasure - Lord's Pleasure, Bro. APPAJI, HEBRON, Silent Pillar.

1957 మే 23

ఈయన పూర్తీ పేరు సంజీవ జ్ఞాన అప్పాజీగారు, 1950 నుండి గౌరవంగా అప్పాజీ అనే పిలుపుతో అందరికీ సుపరిచితులు. ముఖ్యముగా ఈయన నేటి హెబ్రోన్ స్థలమైన తన స్థిరాస్తిని ప్రభువు సేవకై త్యాగం చేసిన దీన దాసుడుగా అందరు గుర్తించిన గొప్ప విశ్వాసి. ఈయన ప్రత్యేకతలు, పరోపకారి, సంగీత ప్రియుడు, క్రియాశీల విశ్వాసి, విశ్వాసులకు మార్గదర్శి, నిశ్శబ్ద సేవాస్థంభం. ఈయన ఎప్పుడు ఎవ్వరికి ఏమి చేసినా ఎల్లప్పుడూ నిస్వార్థంగానే చేసేవారు.

Bro Sanjeeva Jnana Appaji, respectfully addressed as "Appaji", was widely known to everyone since the 1950s. Appaji’s Treasure - Lord's Pleasure, Bro. APPAJI, HEBRON, Silent Pillar.

1957 May 23

Bro Sanjeeva Jnana Appaji, respectfully addressed as “Appaji”, was widely known to everyone since the 1950s. He was a great man of faith and was recognized by all as a humble servant, who sacrificially offered his own property, which is now the present Hebron, for the Lord’s service. He is known for his unique qualities: a generous philanthropist, a passionate lover of music, a steadfast believer, a guiding example to fellow believers, and a silent yet strong pillar of support. He was always selfless in whatever he did for anyone at any time.

Bro. Epaphras Ghogle (1950-2021) was well-known as a Hebron servant of God. Chosen Vessel, Soul-burdened personal evangelist, Prayer warrior, Servant of God.

2021 ఏప్రిల్ 06

సహూ. ఎపఫ్రాస్ ఘోగ్లే (1950-2021) హెబ్రోన్ సేవకునిగా అందరికి సుపరిచితులు. ఈయన రక్షణ, పూర్తీ సేవా పరిచర్య ఒకేసారి ప్రారంభమైనవి. నాటినుండి ఆత్మల భారంతో, వివిధ సువార్త పరిచర్యలు చేసేవారు. ఇంటింటికి, అతి దూర ప్రాంతాలకు సైకిళ్ళ మీద క్యాంపులు, బహిరంగ సువార్తలు, రాత్రిపూట సువార్త కూడికలు ఈలాగు, అన్నిరకాల అవకాశాలను దేవుని మహిమార్థమై సద్వినియోగపరచు కొనేవారు. ప్రాముఖ్యముగా! ప్రభువు ఈయనకు అప్పగించిన ప్రత్యేక భాద్యత, ఈయన వ్యక్తిగత సువార్త. ఈ భాద్యత యెడల మక్కువతో చివరివరకు ప్రత్యేక శ్రద్ధ వహించిరి. ఈయన దగ్గర ఎప్పుడూ కరపత్రాలు, సువార్త పుస్తకములు అందుబాటులో ఉంచుకొని ప్రతిరోజూ ఉదయం విధిగా సువార్త చెప్పటానికి వెళ్ళుతుండేవారు. ఈయన బయట ఉన్నపుడు, సమయము సందర్భము లేకుండా, ప్రతి నిముషము సద్వినియోగ పరచుకొనుచు వ్యక్తిగతంగా సువార్త చెప్పేవారు.

Bro. Epaphras Ghogle (1950-2021) was well-known as a Hebron servant of God. Chosen Vessel, Soul-burdened personal evangelist, Prayer warrior, Servant of God.

2021 April 06

Bro. Epaphras Ghogle (1950-2021) was well-known as a Hebron servant of God. His salvation and full-time service began simultaneously. From that time, with a huge burden, he ministered in various gospel ministries. He travelled door to door to preach the gospel, went on bicycle camps to remote areas, held open-air gospel meetings, and organized nighttime gospel meetings, utilizing every opportunity for the glory of God. Most notably, the special responsibility the Lord entrusted to him was his personal gospel mission. With great passion and dedication, he faithfully fulfilled this responsibility until the very end.