1893 ఏప్రిల్ 25
హెర్మాన్ గుండెర్ట్ (1814–1893) మన దేశములో, కేరళ ప్రాంత ప్రజల మధ్య ఎనలేని సేవచేసిన జర్మన్ మిషనరీ. ఈయన మలయాళ భాష, సాహిత్యంలో చేసిన అపూర్వమైన కృషికి, గుర్తింపు పొందారు. మలబార్ తీరాన తలస్సేరీ (తెలిచేరి)లో ఎక్కువ కాలం సేవ చేశారు. 1859లో ఈయన రచించిన మలయాళభాషా వ్యాకరణం, మలయాళంలో మొదటి సమగ్ర వ్యాకరణ గ్రంథం కాగా, 1872లో ప్రచురించిన మలయాళ-ఇంగ్లీషు నిఘంటువు భాష ప్రమాణీకరణకు బలమైన పునాదులు వేసింది. మలయాళ భాషలో పూర్తి విరామం, అల్ప విరామం, అర్థ విరామం, ఉపవిరామం, ప్రశ్నార్థకం వంటి విరామ చిహ్నాలను పరిచయం చేసిన ఘనత కూడా గుండెర్ట్ దే. ఈయన బైబిల్ను మలయాళంలోకి అనువదించడంలో చురుకుగా పాల్గొని, మాతృభాషలో వేదాంత పాఠాలను అందుబాటులోకి తెచ్చారు.