1931 ఏప్రిల్ 28
ఆండ్రూ జ్యూక్స్ (1847–1931) కెనడాలో జన్మించి, ఇంగ్లాండ్లో విద్యనభ్యసించి, మన దేశమునకు వచ్చి సేవ చేసిన మిషనరీ. ఈయన వైద్యుడిగా క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు, భాషా అభివృద్ధికి గణనీయమైన సేవలందించారు. 1878లో ఈయనను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెందిన, చర్చి మిషనరీ సొసైటీ (CMS) వైద్య మిషనరీగా పంజాబ్, సింద్ లో నియమించింది. ఆండ్రూ జ్యూక్స్ దేరా ఘాజీ ఖాన్ లో ఉంటూ చనిపోయేంత వరకు సేవలు అందించారు. ఇక్కడినుండే నేటి పాకిస్తాన్ ప్రాంతమంతా కవర్ చేసేవారు. ఈయన తన జీవితాన్ని స్థానిక పంజాబీ భాషయైన జట్కీ ఉపభాషలో బైబిల్ అనువాదానికి అంకితమై, 1898లో నాలుగు సువార్తలకు అనువాదాన్ని పూర్తిచేశారు.