Brother B. J. Paul (1922–2003) was a devoted servant from the time of Jehovah-Shammah, well known to many. Servant of God, Translator, Songwriter, Musician. A coworker of Bhakt Singh – instrumental in pioneering the establishment of many churches

2003 మే 16

సహోదరుడు బి జె పాల్ గారు (1922-2003) జెహోవాషమ్మా కాలము నుండి ఉన్న పాతకాల సేవకునిగా ఈయన సుపరిచితులు. 1950 సెప్టెంబరు 25న సహోదరుడు భక్త్ సింగ్ గారితో జెహోవాషమ్మా నుండి బయలుదేరి మధ్యలో సువార్త పరిచర్య చేసుకొంటూ హైదరాబాదుకు తరలి వచ్చిన వారిలో ఈయన కూడా ఒకరు. హైదరాబాదులో మొట్టమొదటి ప్రభువు దినము, బల్ల 1950 అక్టోబర్ 1న వీరికి ఆశ్రయమిచ్చిన సహోదరుడు లారెన్స్ గారి గృహములో జరుగగా, మొదటి సండే స్కూల్ పరిచర్య జరిపే ఆధిక్యత ప్రభువీయనకు అనుగ్రహించెను. 1952 సెప్టెంబరు, విశాఖపట్నంలో మొదటిగా స్థాపించబడిన మిస్పా సంఘమునకు ఈయనే మొదటి సేవకుడు. ఈయనను సీయోను పాటలకు లీడర్ గా అభివర్ణించవచ్చును.

Brother B. J. Paul (1922–2003) was a devoted servant from the time of Jehovah-Shammah, well known to many. Servant of God, Translator, Songwriter, Musician. A coworker of Bhakt Singh – instrumental in pioneering the establishment of many churches

2003 May 16

Brother B. J. Paul (1922–2003) was a devoted servant from the time of Jehovah-Shammah, well known to many. On September 25, 1950, he set out from the Jehovah-Shammah assembly along with Brother Bhakt Singh and continued gospel ministry, eventually moving to Hyderabad. Among those who relocated to Hyderabad for ministry, he was one of them. The first Lord’s Day gathering and breaking of bread in Hyderabad took place on October 1, 1950, at the home of Bro Lawrence, where Bro Paul was also present.

Volbrecht Nagel (1867–1921) was a German missionary who profoundly influenced the Christian community in Kerala, India, Missionary to India, Evangelist, Hymn-Writer, Author, Founder of Rehoboth Orphanage, Bible Teacher

1921 మే 12

వోల్బ్రెచ్ట్ నాగెల్ (1867-1921) జర్మన్ మిషనరీ. ఈయన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో క్రైస్తవ సమాజంపై ఎంతో ప్రభావం చూపారు. ముఖ్యంగా బ్రదరన్ అసెంబ్లీల ద్వారా చేసిన మిషనరీ సేవ, అలాగే మలయాళ భక్తిగీతాల రచన ద్వారా గొప్ప పేరు పొందాడు. ఈయన 1867 నవంబర్ 3న జర్మనీలోని స్టామ్హైం అనే గ్రామంలో ధార్మిక కుటుంబంలో జన్మించారు. కానీ ఎనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులైన పీటర్, ఎలిజబెత్ను కోల్పోయారు. 18 సంవత్సరాల వయసులో, ఓ చెప్పులు కుట్టేవాని మాటలతో సువార్త విని రక్షణ పొందారు. ఈ అనుభవంతో తన జీవితాన్ని మిషనరీ సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు.

Volbrecht Nagel (1867–1921) was a German missionary who profoundly influenced the Christian community in Kerala, India, Missionary to India, Evangelist, Hymn-Writer, Author, Founder of Rehoboth Orphanage, Bible Teacher

1921 May 12

Volbrecht Nagel (1867–1921) was a German missionary who profoundly influenced the Christian community in Kerala, India, through his pioneering work among the Brethren assemblies and his contributions to Malayalam hymnody. He was born on 3 November 1867 in Stammheim, Germany. He grew up in a religious family, but lost his parents, Peter and Elisabeth, when he was eight years old. At the age of 18, he experienced a spiritual awakening, and have been born again after hearing the gospel from a cobbler turned itinerant preacher.

Nikolaus von Zinzendorf (1700–1760) was a German religious and missionary leader, Hymn Writer, Church Reformer, Christian Leader.

1760 మే 09

నికోలాస్ వాన్ జింఝెన్ డార్ఫ్ (1700–1760) ఒక జర్మన్ ఆధ్యాత్మిక ప్రొటెస్టెంట్ మిషనరీ నాయకుడు, మోరావియన్ చర్చిని స్థాపించిన వ్యక్తిగా ప్రసిద్ధి గాంచారు. 1700 మే 26న జర్మనీలోని ఓ ప్రముఖ కుటుంబమైన జింఝెన్ డార్ఫ్ వంశంలో జన్మించారు. చిన్నప్పటి నుండే ఈయన ఆధ్యాత్మిక ఆకర్షణతో, ఉత్తరాలు రాస్తూ, గొప్ప ఉత్తర యుద్ధ సమయంలో ఈయన ప్రార్థనలు చూసి స్వీడిష్ సైనికులు చలించిపోయారు.

Nikolaus von Zinzendorf (1700–1760) was a German religious and missionary leader, Hymn Writer, Church Reformer, Christian Leader.

1760 May 09

Nikolaus von Zinzendorf (1700–1760) was a German religious and missionary leader, best known for his role in founding the Moravian Church, a Protestant denomination with a strong emphasis on missionary work and piety. He was born on May 26, 1700, into the prominent House of Zinzendorf, as the only son of Count Georg Ludwig von Zinzendorf and Baroness Charlotte Justina von Gersdorff. As a child, he was deeply spiritual, often writing love letters to Jesus and tossing them from a castle tower.

Reginald Heber (1783–1826) was an English Bishop. Missionary to India, Bishop, Hymn-Writer, Scholar, Poet, Traveller

1826 ఏప్రిల్ 03

రెజినాల్డ్ హెబెర్ (1783–1826) కలకత్తాలో మిషనరీ సేవచేసిన ఆంగ్ల బిషప్. ఈయన జీవించిన కాలం తక్కువైనా, మన దేశానికి చేసిన సేవలు ఎక్కువే. ఈయన “హోలీ, హోలీ, హోలీ! లార్డ్ గాడ్ ఆల్మైటీ” అనే ఆరాధన గీతము, బ్రైటెస్ట్ అండ్ బెస్ట్” అనే క్రిస్మస్ గీతములు సహా ఇంకా కీర్తనలకు ప్రసిద్ధి. ఇవి ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా, అన్ని చర్చిలలో విస్తృతంగా పాడబడుతున్నాయి. ఈయన 1823 నుండి మరణించే వరకు కలకత్తా బిషప్‌గా సేవచేశాడు. ఈయన స్వల్ప కాలంలో, విద్య, సువార్త ప్రచారానికి ప్రాధాన్యతనిస్తూ భారతదేశంలో క్రైస్తవ మిషన్లను బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశాడు. అభివృద్ధిలో నిలిచిపోయిన బిషప్ కళాశాలకు, విజయవంతంగా నిధులు సేకరించి, అదనపు భూమి మంజూరు చేయడం, దాని నిర్మాణాన్ని పునరుద్ధరించడం వంటి సవాళ్లను ఆయన పరిష్కరించారు.

Reginald Heber (1783–1826) was an English Bishop. Missionary to India, Bishop, Hymn-Writer, Scholar, Poet, Traveller

1826 April 03

Reginald Heber (1783–1826) was an English Bishop. He is best known for his hymns, including “Holy, Holy, Holy! Lord God Almighty!” and “Brightest and Best” which are widely sung till today in all the churches irrespective of the denomination across the world. He served as the Bishop of Calcutta from 1823 until his death in 1826. During his short tenure, he worked tirelessly to strengthen Christian missions in India, emphasizing education and evangelism. Upon arrival, he addressed challenges such as the stalled development of Bishop’s College, successfully raising funds, securing additional land grants, and reviving its construction.

1902 మార్చి 17

జార్జ్ డబ్ల్యూ. వారెన్ (1828-1902) గొప్ప అమెరికన్ ఆర్గానిస్ట్, స్వరకర్త, ఈయన “నేషనల్ హిమ్” అనే గీతం ట్యూన్కు పేరు పొందాడు. దీనిని చర్చిలు, దేశభక్తి కార్యక్రమాలలో పాడే ‘గాడ్ ఆఫ్ అవర్ ఫాదర్స్’ కోసం ఉపయోగిస్తారు. ఈయన న్యూయార్క్లోని ప్రముఖ చర్చి సంగీతకారుడు, అమెరికన్ పవిత్ర సంగీతం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈయన న్యూయార్క్లోని సెయింట్ థామస్, సెయింట్ బార్తోలోమ్యూస్, ఎపిస్కోపల్ చర్చిలలో ఆర్గనిస్ట్గా పనిచేశాడు. అక్కడ పాడిన వారెన్స్ హిమ్స్ ట్యూన్స్లో ఈయన కీర్తనలు, సేవా సంగీతం సంకలనం చేయబడ్డాయి.

1902 March 17

George W. Warren (1828–1902) was an American organist and composer best known for his hymn tune “National Hymn”, which is used for ‘God of Our Fathers’ which is sung in churches as well as patriotic events. He was a prominent church musician in New York and played a significant role in the development of American sacred music. He served as an organist at Episcopal churches in New York, including St. Thomas Church and St. Bartholomew’s Church.