1682 మార్చి 25

థామస్ మేహ్యూ సీనియర్ (1593–1682) అమెరికా, మసాచూసెట్స్ కు చెందిన, మార్తాస్ వైన్ యార్డ్, నాన్‌టుకెట్, ఎలిజబెత్ దీవులను స్థాపించడానికి ప్రసిద్ధి చెందిన, ఆంగ్ల కలోనియల్ సెటిలర్. ఈయన వలసరాజ్యాల న్యూ ఇంగ్లాండ్‌లో వాంపనోగ్‌ లో మార్గదర్శక మిషనరీ కూడా. అనేక మంది వలసవాదుల వలె కాకుండా, మేహ్యూ సీనియర్, తన కుమారుడు, థామస్ మేహ్యూ జూనియర్, వాంపానోగ్‌ తో శాంతియుత సంబంధాలను కోరుకున్నారు, యూరోపియన్ ఆచారాలను విధించకుండా వారి సంస్కృతిలో క్రైస్తవ మతాన్ని ఏకీకృతం చేశారు. వారు వాంపానోగ్ భాషను నేర్చుకొని వారి మాతృభాషలో బైబిల్ సూత్రాలను బోధించారు.

1682 March 25

Thomas Mayhew Sr. (1593–1682) was an English colonial settler known for establishing Martha’s Vineyard, Nantucket, and the Elizabeth Islands. He was also a pioneering missionary among the Wampanoag in colonial New England (America, then under British rule). Unlike many colonists, Mayhew Sr. and his son, Thomas Mayhew Jr., sought peaceful relations with the Wampanoag, integrating Christianity into their culture rather than imposing European customs.

1758 మార్చి 22

జోనాథన్ ఎడ్వర్డ్స్ (1703–1758) మొదటి గొప్ప మేల్కొలుపులో కీలక వ్యక్తి, అమెరికా అత్యంత ప్రభావవంతమైన వేదాంతవేత్తలలో ఒకరు. దేవుని సార్వభౌమాధికారం, మానవ పాపం, నిజమైన మార్పిడి అవసరాన్ని, పాప క్షమాపణను నొక్కిచెప్పిన ఈయన శక్తివంతమైన ఉపన్యాసాలు బాగా పేరు పొందాయి. ఈయన కాల్వినిస్ట్ వేదాంతాన్ని సమర్థించాడు. న్యూ ఇంగ్లాండ్ లో మతపరమైన ఉత్సాహాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించాడు.

1758 March 22

Jonathan Edwards (1703–1758) was a key figure in the First Great Awakening and one of America’s most influential theologians. He is best known for his powerful sermons, such as Sinners in the Hands of an Angry God, which emphasized God’s sovereignty, human sinfulness, and the need for true conversion. He upheld Calvinist theology and was instrumental in reviving religious fervor in New England.

1957 మార్చి 20

ఇసోబెల్ సెలీనా మిల్లర్ కున్ (1901-1957) కెనడియన్ మిషనరీ, చైనా, థాయ్లాండ్ లోని లిసు ప్రజలకు ఈమె చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది. ఈమె, ఈమె భర్త, జాన్ కున్ చైనా ఇన్ల్యాండ్ మిషన్ లో సేవ చేశారు. వీరు ప్రధానంగా సువార్త ప్రచారం, శిష్యరికం, బైబిల్ అనువాదంపై దృష్టి సారించి మారుమూల ప్రాంతాల్లోని లిసు ప్రజల మధ్య సేవ చేశారు. యుద్ధం, అనారోగ్యం, హింస వంటి కష్టాలు ఉన్నప్పటికీ, తమ మిషన్కు కట్టుబడి నిబద్ధతగా ఉన్నారు. వీరు పాఠశాలలను స్థాపించారు, చాలా మంది పిల్లలను చదివించారు.

1957 March 20

Isobel Selina Miller Kuhn (1901–1957) was a Canadian missionary and author known for her work among the Lisu people of China and Thailand. Kuhn and her husband, John Kuhn, served with the China Inland Mission (now OMF International). They worked primarily among the Lisu people in remote regions, focusing on evangelism, discipleship, and Bible translation. Despite hardships such as war, illness, and persecution, they remained committed to their mission. They founded schools and educated many children.

John Mason Peck (1789–1858)

1858 మార్చి 14

జాన్ మేసన్ పెక్ (1789-1858) అమెరికన్ బాప్టిస్ట్ మార్గదర్శకుడు, మిషనరీ. ఈయన అమెరికా పశ్చిమ సరిహద్దులో క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈయన

1898 మార్చి 10

జార్జ్ ముల్లర్ (1805-1898) గొప్ప క్రైస్తవ మత ప్రచారకుడు, ఇంగ్లాండ్, బ్రిస్టల్లో యాష్లే డౌన్ అనాథాశ్రమ స్థాపకుడు. ఈయన దేవుని ఏర్పాటుపై అచంచలమైన విశ్వాసానికి ప్రసిద్ధి గాంచాడు. ఎప్పుడూ విరాళాల మీద ఆధారపడలేదు, కానీ వేలాది మంది అనాథల అవసరాలను తీర్చడానికి ప్రార్థనపై మాత్రమే ఆధార పడేవాడు. తన జీవితకాలంలో, ముల్లర్ 10,024 మంది అనాథలను చూసుకున్నాడు. ఈయన 117 పాఠశాలలను స్థాపించాడు, ఇవి 120,000 కంటే ఎక్కువ మంది క్రైస్తవ విద్యను అందించాయి. ఈయన ప్లైమౌత్ బ్రదర్న్ ఉద్యమ స్థాపకులలో ఒకడు. తరువాత విభజన సమయంలో, ఈయన బృందాన్ని ఓపెన్ బ్రదరెన్ అని పిలిచారు.

1898 March 10

George Muller (1805–1898) was a Christian evangelist and the founder and director of Ashley Down orphanage in Bristol, England. He is best known for his unwavering faith in God’s provision, never soliciting donations directly but relying solely on prayer to meet the needs of thousands of orphans. Throughout his lifetime, Müller cared for over 10,024 orphans. He established 117 schools which offered Christian education to more than 120,000. He was one of the founders of the Plymouth Brethren movement. Later during the split, his group was called the Open Brethren.