నిజ క్రైస్తవునికి ఈ లోకంలో శ్రమ, హింస తప్పనిసరి—అని ప్రభువూ, పౌలూ నొక్కి చెప్తున్నారు. ఈ బైబిల్ బోధ నేటి క్రైస్తవ సెలబ్రటి స్పీకర్ల బోధకు విరుద్ధం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.హింస ధన్యత ఎలా అవుతుంది?

హింస ధన్యత ఎలా అవుతుంది?

నిజ క్రైస్తవులకి ఈ లోకంలో హింస తప్పదు. “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు” (2 తిమో.3:12) అని బైబిల్ చెబుతోంది. ఇక్కడ ప్రత్యేకించి అన్యులనుంచీ లేక క్రైస్తవ ద్వేషులనుంచీ  లేక సజ్జన ద్వేషులనుంచీ (2 తిమో. 3:3) వచ్చే హింస గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. ఇది క్రీస్తును తూ.చ. తప్పకుండా పాటించడం లేక ఆయన్ను మాత్రమే పూజించడం వల్ల లేక లోక మర్యాద కంటే క్రీస్తు ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల (ఒక క్రైస్తవుడికి) కలిగే హింస. ఇటువంటి హింస గుండా వెళ్ళే క్రైస్తవులని ప్రభువు ధన్యులు అంటున్నారు. ఆ ప

గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.

భయం మధ్య అభయం

ఈ కీర్తన చిన్న పిల్లలకు కూడా సుపరిచితమే. కంటత వాక్యాల్లో కూడా తరచూ వింటూ ఉంటాం. మనలో అనేకమందికి ఇది బాగా కంఠత వచ్చిన కీర్తన కూడా. ఆరు వచనాలున్న ఈ కీర్తనలో ఈ ఒక్క నాల్గో వచనం తప్ప అన్ని మనల్ని ఆదరించి, పురికొల్పి, వెన్నుతట్టి, ప్రోత్సహించి, బలపరిచే సానుకూల వచనాలే. నాల్గవ వచనం అకస్మాత్తుగా కీర్తన మధ్యలో తటస్థించి జీవితములోని ఒక ప్రతికూల పరిస్తితి గురించి మాట్లాడుతుంది. అదే “గాడాంధకారపు లోయ”. ఈ కీర్తన కవితా దోరణిలో ఉంది గనుక ఈ కవితాత్మక అంతరార్ధాన్ని మనం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. బైబిల్ పరిభాషలో చీకటి, గాడాంధకారం, లోయ వంటి పదాలకు అర్ధం ఒక శ్రమ కావొచ్చు, ఒక కష్టం కావొచ్చు, ఒక కీడు కావొచ్చు, ఒక భయం కావొచ్చు, ఒక ఉపద్రవం కావొచ్చు, చివరికి మరణపుటంచులలో ప్రయాణించే ఒక అనుభవం కావొచ్చు.