Pandita Ramabai Sarasvati (1858 – 1922) was an Indian first woman Indian Missionary, Prayer Warrior, Founder of Mukthi Mission, Scholar, Social Reformer, Activist, Script Translator

1922 ఏప్రిల్ 05

పండిత రమాబాయి (1858-1922) భారత దేశంలో మొదటి మహిళ మిషనరీ, తన భర్త మరణానంతరం, వైద్య విద్య కొరకు 1883 లో ఇంగ్లాండుకు వెళ్లగా, అక్కడ కలసిన ఆంగ్లికన్ సోదరి చూపించిన దయ, సేవకు ప్రభావితమై ఈమె క్రైస్తవ్యము స్వీకరించెను. తర్వాత అమెరికాలో విస్తృతంగా పర్యటించి నిరుపేద భారతీయ మహిళల కోసం నిధులు సేకరించారు. ఈ నిధులతో బాల వితంతువుల కోసం శారదా సదన్ ను ఏర్పాటు చేసిరి. 1890లో, ఈమె పూణే సమీపంలోని కేద్గావ్లో ముక్తి మిషన్ అనే క్రిస్టియన్ ఛారిటీని స్థాపించిరి, ఆ తర్వాత దీనిని పండిత రమాబాయి ముక్తి మిషన్గా మార్చారు. ముక్తి మిషన్ అంటే వెలుగును ప్రసారించే గొప్ప ఆశ్రమం, దీని నినాదం “రెస్క్యూ, రీడీమ్, రీస్టోర్.”

Pandita Ramabai Sarasvati (1858 – 1922) was an Indian first woman Indian Missionary, Prayer Warrior, Founder of Mukthi Mission, Scholar, Social Reformer, Activist, Script Translator

1922 April 05

Pandita Ramabai Sarasvati (1858 – 1922) was an Indian first woman missionary and social reformer. After her husband’s death in 1883, she went to England for medical education, where she was inspired by an Anglican sister’s kindness and service and embraced Christianity. She later travelled extensively in the United States, raising funds for destitute Indian women. With these funds, she established Sharada Sadan for child widows. In the late 1890s, she founded Mukti Mission, a Christian charity in Kedgaon, near Pune, which was later renamed Pandita Ramabai Mukti Mission. The motto of the Mukti Mission is “Rescue, Redeem, and Restore.”

1957 మార్చి 20

ఇసోబెల్ సెలీనా మిల్లర్ కున్ (1901-1957) కెనడియన్ మిషనరీ, చైనా, థాయ్లాండ్ లోని లిసు ప్రజలకు ఈమె చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది. ఈమె, ఈమె భర్త, జాన్ కున్ చైనా ఇన్ల్యాండ్ మిషన్ లో సేవ చేశారు. వీరు ప్రధానంగా సువార్త ప్రచారం, శిష్యరికం, బైబిల్ అనువాదంపై దృష్టి సారించి మారుమూల ప్రాంతాల్లోని లిసు ప్రజల మధ్య సేవ చేశారు. యుద్ధం, అనారోగ్యం, హింస వంటి కష్టాలు ఉన్నప్పటికీ, తమ మిషన్కు కట్టుబడి నిబద్ధతగా ఉన్నారు. వీరు పాఠశాలలను స్థాపించారు, చాలా మంది పిల్లలను చదివించారు.

1957 March 20

Isobel Selina Miller Kuhn (1901–1957) was a Canadian missionary and author known for her work among the Lisu people of China and Thailand. Kuhn and her husband, John Kuhn, served with the China Inland Mission (now OMF International). They worked primarily among the Lisu people in remote regions, focusing on evangelism, discipleship, and Bible translation. Despite hardships such as war, illness, and persecution, they remained committed to their mission. They founded schools and educated many children.

alfred-saker

1880 మార్చి 12

ఆల్ఫ్రెడ్ సేకర్ (1814-1880) ఆఫ్రికాలోని కామెరూన్‌లో క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ మిషనరీ. ఈయన బాప్టిస్ట్ మిషనరీ సొసైటీతో అనుబంధం కలిగి, పశ్చిమ ఆఫ్రికాలో సువార్త ప్రచారం, అనువాదం, క్రైస్తవ సంఘాలను స్థాపించడంలో ఈయన ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. ఈయన కేవలం “మిషనరీ టు ఆఫ్రికా” అని పిలవబడాలని ఇష్టపడ్డాడు. 1858లో, ఈయన స్పానిష్ ద్వీపం ఫెర్నాండో పో నుండి దక్షిణ కామెరూన్ కు ఒక మిషన్‌కు నాయకత్వం వహించాడు, అక్కడ బింబియా చీఫ్‌ల నుండి భూమిని కొనుగోలు చేసి, విక్టోరియాను స్థాపించాడు, తరువాత 1982లో లింబేగా పేరు మార్చాడు. ఈయన, ఫెర్నాండో పో కామెరూన్‌లో బాప్టిస్ట్ చర్చిలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు.

alfred-saker

1880 March 12

Alfred Saker (1814-1880) was a British missionary who played a key role in spreading Christianity in Cameroon, Africa. He was associated with the Baptist Missionary Society and is best known for his efforts in evangelism, translation, and establishing Christian communities in West Africa. He preferred to be known simply as a “Missionary to Africa”. In 1858, he led a mission from the Spanish island of Fernando Po to Southern Cameroons, where he purchased land from Bimbia chiefs and founded Victoria, later renamed Limbe in 1982.