-
1453, మే 29
రవి అస్తమించని రోమ్ సామ్రాజ్య కీర్తి శిఖరంలో మకూటయమానంగా ఉన్న కాన్స్టాంటినోపుల్ మహా నగరం కుప్పకూలిన రోజు. నాటి రోమ్ సామ్రాజ్యాధినేత కాన్స్టెంటైన్ క్రీ.శ. 324లో స్థాపించిన రాజధాని నగరమిది. రెండో సుల్తాన్ మహమ్మద్ నాయకత్వంలోని ఒట్టోమన్ సైన్యం ఏప్రిల్ 6న ఈ నగరాన్ని ముట్టడి చేసింది. యుద్ధం యాభై మూడో రోజున, 1453 మే 29న శత్రు సైన్యం స్వాధీనం చేసుకోవడంతో ఈ నగర వైభవ చరిత్ర ముగిసిపోయింది.
-
మే 28, 1403
ఈరోజు జాన్ విక్లీఫ్ సిద్ధాంతాలను వ్యాపింప చేస్తున్న జాన్ హస్ మొదలైన వారికి జర్మన్ యునివర్సిటీ పండితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.
-
మే 27, 1564
ఫ్రెంచ్ క్రైస్తవ వేదాంతి, క్రైస్తవ సంఘ సంస్కరణలో అత్యంత కీలక పాత్ర పోషించిన మేధావి, కాల్వినిజంకు ఆద్యుడు జాన్ కాల్విన్ మహిమలోకి ప్రవేశించిన రోజు. దేవుని పనిలో అహర్నిశలు శ్రమించిన కాల్విన్ చివరిగా 1558లో జ్వరంతో అనారోగ్యం పాలయ్యాడు. తన “ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిలీజియన్”ను అనారోగ్యంలోనే పునర్విమర్శ చేసిన కాల్విన్ ఆరోగ్యం క్రమేపీ క్షీణించింది. కొంతకాలం శ్వాసకోశ వ్యాధితో బాధపడ్డ కాల్విన్ చివరికి తన యాభై నాల్గవ ఏట ప్రభువు పిలుపు అందుకున్నాడు.…
-
మే 26, 1521
జర్మనీలోని వర్మ్స్ నగరంలో నాటి ఐదో చార్ల్స్ చక్రవర్తి మార్టిన్ లూథర్ కి వ్యతిరేఖంగా శాసనం జారీ చేసిన రోజు. దీనినే ఈడిక్ట్ ఆఫ్ వర్మ్స్ లేక వర్మ్స్ శాసనం అంటారు. లూథర్ రచనల్ని నిషేధిస్తూ, ఆయన్ని రాజద్రోహిగా ప్రకటిస్తూ చేసిన శాసనం ఇది. లూథర్ ను నిర్బంధించి రాజు ముందు నిలబెట్టాలన్నది శాసనం. ఈ శాసనాన్ని గట్టిగా అమలు చేయలేకపోయినా ఈ శాసనం వల్ల ఆ తర్వాత లూథర్ తన కదలికల్ని…




