-
నేత్రాశతో జాగ్రత్త!
నేత్రాశతో జాగ్రత్త! నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?—యోబు 31:1 “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అన్నారు. కళ్ళు దేవుడు మనకిచ్చిన అపురూపమైన వరాల్లో ఒకటి. ఐతే వాటిని అపురూపంగా చూసుకోకపోతే అవి శాపంగా కూడా పరిణమించ గలవు—మరి ముఖ్యంగా క్రైస్తవ జీవనానికి! అంచేత “సర్వేంద్రియాణాం నయనం ప్రమాదం” అన్నది కూడా నిజమే అనిపిస్తుంది. ఈ ప్రమాదం అర్థమైంది కనుకనే యోబు తన కళ్ళతో “నిబంధన” చేసుకున్నాడు. పరిశుద్ధమైన దేవుని…
-
ప్రార్థనా చింత!
ప్రార్థనా చింత! కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి —పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.—మత్తయి 6:9 మనం ప్రార్థన ఎలా చేయాలో ప్రభువిక్కడ ఒక నమూనా ఇస్తున్నారు. ఇది వల్లె వేసే ప్రార్థన కాదు. మన ప్రార్థనలన్నిటినీ నిర్దేశించి సరిచేసే మాదిరి ప్రార్థన. అంటే ఈ ప్రార్థన మాదిరిగానే మన ప్రార్థనలన్నీ ఉండాలన్నది గూడార్థం! సాధారణంగా మన ప్రార్థనల్లో మన…
-
దేవుని పితృత్వం
ప్రభువు నేర్పిన ప్రార్థనలో మొదటి వచనమిది. ఈ ప్రభువు ప్రార్థన “పరలోకమందున్న మా తండ్రీ” అన్న సంబోధనతో ఆరంభమవుతుంది. “తండ్రీ” అన్న ఈ పిలుపు క్రైస్తవ ప్రార్థనకు పునాది. ఇది క్రైస్తవానికి ప్రత్యేకం. ఇతర మతాల్లో దేవుడ్ని తండ్రీ అని పిలవడం అరుదు. యూదులకు తమ దేవుడి నామాన్ని ఉచ్చరించడానికే భయం. ఇస్లాంలో అది నిషిద్ధం. అందుకే క్రీస్తును తెలుసుకున్న ఆ ముస్లిం మహిళ బిల్కిస్ షేక్ “ఐ డేర్ టు కాల్…
-
మన విధి!
మన విధి! ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.—ప్రసంగి 12:13 అసలు మనిషి దేవునికి ఎందుకు భక్తి చేయాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు విధేయుడు కావాలి? ఎందుకంటే ఆయన దేవుడు కనుక. మనం ఆయన సృజించిన జీవులం కనుక. దేవుడు ఉంటే ఆయన సర్వానికీ సృష్టి కర్తే! సర్వ జీవులూ ఆయన వారే! భూమియు దాని సంపూర్ణతయు లోకమును…