-
భక్తి – తృప్తి
“భక్తి” అంటే వల్లమాలిన ప్రేమ. గౌరవ ప్రదమైన ప్రేమ. “దైవ భక్తి” అంటే దేవుడ్ని ప్రేమించడం. దేవుడ్ని సమున్నతంగా, సంపూర్ణంగా ప్రేమించడం. అన్నింటికీ మించి, అందరికీ మించి నా సర్వస్వాన్ని అర్పిస్తూ ఆయన్ను ప్రేమించడం. ఇలాంటి భక్తిలో సంతోషం, సంతృప్తి సహజంగానే ఉంటాయి. ఈ భక్తి గొప్ప లాభాన్ని చేకూరుస్తుంది. శాశ్వత ఆశీర్వాదాన్ని మన సొంతం చేస్తుంది.
-
అద్వితీయ ప్రేమ!
ఈ మధ్య ఓ నాస్తిక శిఖామణి “దేవుడు ప్రేమోన్మాది” అన్నాడు. నన్నే ప్రేమించు, నాకన్నా ఎక్కువగా ఎవర్నీ ప్రేమించకు అనడం ఉన్మాదం కాక మరేంటి—అన్నది అతని వాదన. ఓ పక్క దేవుడే లేడంటూ మరో పక్క ఆయన్ని తిట్టడం ఎంత హాస్యాస్పదం! లేని దేవుడ్ని ఎలా తిడతావయ్యా “హేతు వాదీ”! నీ తిట్లు నిజమైతే దేవుడు ఉన్నట్టే కదా సామీ!
-
వినయ విధేయ విశ్వాసం
నేటి క్రైస్తవంలో చాలా మంది విశ్వసించడమంటే మతం పుచ్చుకోవడమో, బాప్తీస్మం తీసుకోవడమో, నిర్ధారణ తీసుకోవడమో లేక స్వస్థత కోసమో, అద్భుతాల కోసమో ప్రార్థన చేయించుకోవడమో అనుకుంటున్నారు. దానికి తోడు మన అయ్యగార్ల ప్రసంగాలూ అలానే ఉన్నాయి. విశ్వాసమంటే పూర్తిగా ఆధారపడటం, ఆనుకుపోవడం. ఈ విశ్వాసం ఒక అయ్యగారి ప్రార్థన పైనో, ఆయన ఇచ్చే నూనె బుడ్డి పైనో, ఒక సంఘ నియమం పైనో, ఒక సిద్ధాంతం పైనో కాదు. ఈ విశ్వాసం ఒక…
-
చాలినంత కృప!
అందుకు– నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. —2 కొరిం. 12.9 “నా కృప నీకు చాలును”. ఈ మాట మీద అనేక క్రైస్తవ పాటలు రాశారు. ప్రసంగాలూ చేశారు. ఇది క్రైస్తవుల నోట అతి విరివిగా వినబడే మాట. కానీ ఎందరికి దేవుని కృప నిజంగా…