-
కాలాన్ని శాసించే దేవుడు
“అతని టైం బాలేదండి, ఏం చేస్తాం!” “కాలమే నిర్ణయించాలి” “కాలమే గాయాన్ని మాన్పుతుంది”. ఇలాంటి మాటలు తరచూ వింటూ ఉంటాం. కాలానికి అంత సీన్ లేదు! కాలం సృష్టికర్త కాదు, అది సృష్టం మాత్రమే! అంచేత కాలం ఎవడ్నీ శాసించ లేదు, ఎవడికీ ఒకింత సాయం చేయలేదు. ఎవ్వరికీ అదృష్టాన్ని తెచ్చిపెట్ట లేదు. అరిష్టాన్ని అసలివ్వలేదు.
-
క్రీస్తు మనస్తత్వం
మనస్తత్వం మనిషి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మనస్తత్వమే మనిషి ప్రవర్తనను శాసిస్తుంది. మనస్తత్వమంటే మనిషి ప్రవృత్తి, ఆలోచనా సరళి, వైఖరి—మనల్ని మనం చూసుకునే దృష్టి, ఇతరుల్ని చూసే దృష్టి. ప్రవృత్తిని బట్టే వృత్తి ఉంటుంది. ఆలోచనా సరళిని బట్టే ఆచరణా శైలి ఉంటుంది. మరి క్రీస్తు మనస్తత్వమంటే ఏంటి?
-
క్రైస్తవ మనస్సాక్షి
మనస్సాక్షి వల్లనే లోకంలో ఇంకా కాస్తయినా మానవత్వం బ్రతికి ఉంది. మనస్సాక్షి వల్లనే ప్రతీ మనిషికీ తప్పొప్పులు తెలుస్తాయి (రోమా 2.14,15). మనస్సాక్షి మనిషికి దేవుడిచ్చిన వరం. నైతికతకు మూలాధారమైన దేవుడు మనిషిని “తన పోలికలో” సృష్టించాడు కాబట్టే సహజంగా మనిషికి నైతిక స్పృహ అబ్బింది. ఆ నైతిక స్పృహను కలిగించే అంతర్గత సామర్థ్యమే “మనస్సాక్షి”.
-
దేవునికి భయపడండి
నేడు క్రైస్తవంలో బాగా కొరవడింది అంటూ ఏదైనా ఉంది అంటే అది “దేవుని భయం” అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. అన్యులైనా వాళ్ళ దేవుళ్ళకు భయపడుతున్నారు గానీ మనలో చాలా మందికి ఆ స్పృహ లేదు. సంఘారాధన జరుగుతున్నపుడు మోగే సెల్ ఫోన్స్, వాక్య పరిచర్య జరుగుతున్నపుడు పక్క వారితో మాట్లాడే తీరు, ఓ పక్క వాక్య ప్రబోధం జరుగుతుంటే స్టేజ్ మీద కూర్చున్న అయ్యవార్లు మాట్లాడుకుంటున్న తీరు, ప్రార్థన మధ్యలో వచ్చి కాఫీ…