-
అపవాదికి భయపడకండి
మన దేశం మూఢ నమ్మకాలకు పెట్టింది పేరు. తుమ్మితే అనర్థం, నల్ల పిల్లి ఎదురైతే అనర్థం, నర దిష్టి అనర్థం, ఇంట గోళ్ళు కత్తిరిస్తే అనర్థం, నోట “చావు” అంటే అశుభం, మంగళవారం అశుభం, నల్లరంగు అశుభం, అమావాస్య అశుభం, వితంతువు ఎదురొస్తే అశుభం, బుధవారం ఆడపిల్ల పుడితే అరిష్టం, కాకి తల మీద తన్నితే అరిష్టం, బల్లి మీదపడితే అరిష్టం, ఇలా ఒకటేమిటి, అనేకమైన మూఢ నమ్మకాలు మన తెలుగు రాష్ట్రాల్లో…
-
ఇవ్వడం నేర్చుకుందాం
“కాసు” అంటే మూల భాషలో “లెప్టన్” అని ఉంది. నాటి రోమా సామ్రాజ్యంలో అతి తక్కువ విలువ ఉన్న నాణెం అది. మనకు పూర్వం కాసు అంటే దాదాపు అరపైసా. వాళ్ళకి ఆ నాడు కాసు అంటే దేనారంలో నూట ఇరవై ఎనిమిదో భాగం. దాదాపుగా విలువ లేని నాణెం. ఇలాంటి రెండు నాణేలను ఒక పేద వితంతువు కానుక పెట్టెలో వేయడం చూసిన ప్రభువు “ఈమె అందరికంటే ఎక్కువ వేసింది” అంటున్నాడు.…
-
ప్రభువునెరిగిన భక్తి
యోబుకు కష్టాలు ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చి పడ్డాయి. ఆస్తి నష్టమే కాదు, ఆరోగ్యమూ ఆవిరైపోయింది. బిడ్డల్ని పోగొట్టుకున్న కడుపు కోత పిండేస్తోంది. ఆదరించాల్సిన స్నేహితులు అనరాని మాటలు అంటున్నారు. భార్య సహకారం అంతంత మాత్రమే. అంతటి భాగ్యవంతుడు, భక్తుడు ఒక్కసారిగా ఏకాకి అయిపోయాడు. దేవుడు కూడా వదిలేశాడా అనిపించే నిరాశ, నిస్పృహ ఆవహిస్తున్న పరిస్థితి. కానీ యోబులో ఆశ చావలేదు. అతనిలోని భక్తుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. అతని విశ్వాసం అంతరించి పోలేదు.…
-
మా, తుజే సలాం
తల్లిని ప్రేమించడం, గౌరవించడం ‘మదర్స్ డే’ కి పరిమితం కాకూడదు. ఆమె మన బ్రతుకంతటికీ తల్లి—చిన్నప్పుడు పెద్ద వాళ్ళమైనప్పుడు, మనకు పెళ్లి అయ్యాక పెళ్లి కాకమునుపు, ఆమె మనకు సాయం చేసేటప్పుడు, మన సాయం ఆమెకు అవసరం అయినప్పుడు—అమ్మ మనకు అమ్మే! దేవుడి తర్వాత—అమ్మ మనకంత విలువైనది, ఆమె ప్రేమ అంత పవిత్రమైనది, ఆమె అంత గౌరవం పొందతగింది.