-
సత్యారాధన
సమరయ స్త్రీతో సంభాషణలో ప్రభువు చెప్పిన మాట ఇది. సమరయులు తెలియక ఆరాధిస్తారని, యూదులు తెలిసి ఆరాధిస్తారని చెప్పారాయన. అజ్ఞానం ఆరాధనకు గొడ్డలి పెట్టు. అది దేవుడ్ని అపార్థం చేసుకుంటుంది. ఆ అపార్థం దేవుడ్ని తప్పుగా ఊహించుకోవడానికి ఊతమిస్తుంది. అలా అజ్ఞానం ఆరాధనను పేలవంగా మార్చడమే గాక, దాన్ని పక్కదోవ పట్టించి చివరికి విగ్రహారాధనకు నడిపిస్తుంది. ఇదంతా తెలియకుండానే జరిగిపోతుంది. దేవుడ్ని తప్పుగా ఊహించుకోవడమే విగ్రహారాధనకు పునాది. అటు యూదుల చరిత్ర, ఇటు…
-
క్రైస్తవ ఇంగితం
“ఇంగితం” లేక “ఇంగిత జ్ఞానం” మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం. ఇంగ్లిష్ లో దీన్ని “కామన్ సెన్స్” అంటారు. ఇది మనుషులందరికీ అందుబాటులో ఉంటుంది గనుక దీన్ని అలా పిలిచారు. సృష్టిలో జంతువులకు లేని ఇంగిత జ్ఞానం మనిషికి దొరికింది. దేవుని పోలికలో పుట్టిన మనిషికి ఇది సహజంగానే అబ్బింది. ఇంగిత జ్ఞానం దేవుని పోలికలో అంతర్భాగం. అందుకే దేవుడు ఇంగిత జ్ఞానానికి వ్యతిరేకి కాదు.
-
క్రీస్తే మూలం
మార్పు లోకంలో సహజం. కాలం మారుతుంది. విశ్వంలో ప్రతీ వస్తువు మార్పుకు లోనౌతుంది. నక్షత్ర రాశులు స్థానభ్రంశం చెందుతూనే ఉంటాయి. నక్షత్రాలు మండిపోతూ ఉన్నాయి. సూర్యుడి సైజూ క్రమేపీ తగ్గిపోతూ ఉంది. వాతావరణం విపరీత మార్పులకు గురవుతూ వస్తోంది. మనుషులూ, వారి ఆరోగ్య పరిస్థితులూ, వారి వ్యవస్థలూ, విలువలూ, సంబంధాలూ అన్నీ నిత్యం మారుతున్న విషయాలే. మన దేశంలో ఐతే మనం అనాదిగా మన దేవుళ్లనూ మార్చుకుంటూ వస్తున్నాం.
-
అందరికీ మంచి చేద్దాం
క్రైస్తవం స్వార్థ పరాయణత్వంతోనో, మత మౌఢ్యంతోనో ఆవిర్భవించిన విశ్వాసం కాదు. క్రైస్తవం ఇచ్చి వేసుకునే విశ్వాసం. ఆదిమ సంఘంలో విశ్వాసులు తమలోని అక్కర ఉన్న ప్రతి ఒక్కరికీ ఆస్తులను పంచి పెట్టారు(అపో.2.44-45). మన దేవుడు ఇచ్చే దేవుడు, నిలువు దోపిడీ చేసే దేవుడు కాదు. మన దేవుడు లోకాన్ని ప్రేమించి, లోక రక్షణ కోసం తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చివేసిన దేవుడు (యోహా. 3.16). తాను దొంగిలించడానికి రాలేదని, ప్రాణాన్ని పణంగా పెట్టడానికి…